వంగా గీత
వంగా గీత.. ప్రస్తుత కాకినాడ వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంట్ సభ్యురాలు. 1964, మార్చి 1న తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో జన్మించారు వంగా గీత. రాజమండ్రిలోని జీఎస్‌కే కాలేజీ నుంచి బీఎల్ పట్టా, నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి "లా"లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది వంగా గీత. తొలుత అడ్వకేట్‌గా పని చేసిన వంగా గీత.. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985-93 వరకు మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్ పర్సన్‌గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1997లో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వంగా గీత పని చేశారు. ఆ తర్వాత వంగా గీత 2000-2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై టీడీపీ నుంచి 2009 సంవత్సరంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009-2014 మధ్య ప్రజారాజ్యం పార్టీ తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా పని చేశారు వంగా గీత. అనంతరం కాంగ్రెస్ పార్టీ.. ఆ వెంటనే 2019 ఎన్నికల ముందు వైసీపీ పార్టీలోకి చేరారు వంగా గీత. 2019 ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిపొందారు వంగా గీత.