AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ప్రేమజంటకు కలిసొచ్చిన సర్పంచ్ ఎలక్షన్‌.. రాత్రికి రాత్రే..

సర్పంచ్‌ ఎన్నికల సమయంలో జరిగినన్ని చిత్ర విచిత్రాలు ఏ ఎన్నికలప్పుడు జరగవేమో.. సినిమాను మించిన ట్విస్టులతో రక్తికట్టిస్తాయి కొన్ని సంఘటనలు. సర్పంచ్‌ పదవి కోసం పెళ్లి చేసుకుంటారు కొందరు. సర్పంచ్‌ ఎన్నికలను అడ్డంపెట్టుకుని లవ్ మ్యారేజ్‌ చేసుకుంటారు మరికొందరు. సంగారెడ్డి జిల్లాలో ప్రేమజంటకు సర్పంచ్ ఎలక్షన్‌ కలిసొచ్చింది.

Telangana: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ప్రేమజంటకు కలిసొచ్చిన సర్పంచ్ ఎలక్షన్‌.. రాత్రికి రాత్రే..
Sangareddy Sarpanch Election
P Shivteja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 01, 2025 | 9:47 AM

Share

ఎన్నికల పుణ్యమా అంటూ ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు.. ఎన్నికలు ఏంటి.. పెళ్లేంటి అనుకుంటున్నారా.. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో రిజర్వేషన్ తనకు అనుకూలించక పోవడంతో తను ప్రేమిస్తున్న అమ్మాయిని బరిలోకి నిలిపాడు ఒక యువకుడు.. షాకులు, మలుపులు.. సర్పంచ్ ఎన్నికల్లో కామన్. కానీ ఇలాంటి సీన్ మాత్రం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయింది. ఈ విషయం తెలియగానే ఎగిరి గంతేశాడు చంద్రశేఖర్ అనే యువకుడు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన శ్రీజ అనే యువతిని ప్రేమించిన చంద్రశేఖర్ గౌడ్ ఆమెతో మధ్యాహ్నం నామినేషన్ వేయించాడు. కూతురు నామినేషన్ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నామినేషన్ ఉపసంహరించుకోవాలని శ్రీజపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె రాత్రి యాదగిరి గుట్టకు వెళ్లి చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకున్నారు.

తమ కూతురు కనిపించడం లేదని సంగారెడ్డి రూరల్ పోలీసులకు కంప్లయింట్ చేశారు శ్రీజ తల్లిందండ్రులు. చంద్రశేఖర్ కిడ్నాప్ చేశారని ఆరోపించారు.

అయితే తాను కిడ్నాప్ కాలేదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ప్రకటించింది శ్రీజ. తాను మేజర్‌ను అని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాని పోలీసులకు తెలిపింది.

ఇంతలో ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు.. శ్రీజకు మద్దతుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్‌ఎస్‌ నేతలు.

ఇక సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన శ్రీజ తన భర్త సహకారంతో గెలుస్తానంటోంది. చంద్రశేఖర్ కూడా తన భార్యను గెలిపించుకుంటానంటున్నాడు. ఇప్పుడు తనకు అండగా ఉంటే రేపు ఊరికి అండగా ఉంటానంటున్నాడు.

వీడియో చూడండి..

తాళ్లపల్లి ప్రజలు ఈ ప్రేమజంటకు పట్టం కడతారో లేదో చూడాలి మరి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..