CM Revanth Reddy: మెస్సీతో మ్యాచ్ కోసం.. ఫుడ్‌బాల్ ప్రాక్టీస్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్న స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్దం అవుతున్నారు. ఇందుకోసం ఆదివారం రాత్రి ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఫుట్‌బాల్ గ్రౌండ్లో గంటపాటు ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Cm Foodball
- ప్రపంచ స్టార్ ఫుడ్‌బాల్ ప్లేయర్.. లియోనెల్ మెస్సీ ఇండియా టూర్‌కు సిద్ధమయ్యారు. ఈ టూర్లో భాగంగా డిసెంబర్ 13న ఆయన హైదరాబాద్ రానున్నారు. అయితే హైదరాబాద్ రానున్న మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడనున్నారు.
- అయితే మెస్సీలో మ్యాచ్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఇందుకోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్లో ఆయన ప్రాక్టీస్ మొదలు పెట్టారు.
- రోజంతా కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం రాత్రి ఫుట్ బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్ లోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. యువతతో కలిసి ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. సుమారు గంటపాటు ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు.
- ఇక డిసెంబర్ 13న హైదరాబాద్ రానున్నారు ఫుడ్బాట్ స్లార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో ప్రముఖులతో కలిసి ఆయన ఫుడ్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనున్నారు. ఇక్కడే సీఎం రేవంత్ కూడా మెస్సీతో మ్యాచ్ ఆడనున్నారు.
- ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ స్పోర్ట్స్ స్పిరిట్‌ను హైలైట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా రాష్ట్రంలో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అనేక నిర్ణయాలను ఆయన తీసుకుంటున్నారు.





