- Telugu News Photo Gallery Business photos How Many Days Will the Stock Market Be Closed in December 2025 Know NSE BSE Stocks and Shares Trading Schedule
Stock Market: డిసెంబర్‌లో స్టాక్ మార్కెట్ ఎన్ని రోజులు మూసి ఉంటుంది?
Stock Market: డిసెంబర్ 2025లో NSE, BSE స్టాక్ మార్కెట్లు ఎన్ని రోజులు మూసి ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. స్టాక్ మార్కెట్ మూసి ఉండే రోజుల సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ప్లాన్ చేసుకోవడం బెటర్. అలాగే స్టాక్..
Updated on: Nov 30, 2025 | 7:46 PM

Stock Market: 2025 సంవత్సరం చివరి నెల 'డిసెంబర్' సోమవారం నుండి ప్రారంభమవుతుంది. NSE అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్‌లో వారాంతపు సెలవులు కాకుండా, మొత్తం నెలలో ఒకే ఒక ట్రేడింగ్ సెలవు ఉంటుంది.

అంటే భారత స్టాక్ మార్కెట్ వచ్చే నెలలో మొత్తం 9 రోజులు మూసి ఉండనుంది. డిసెంబర్‌లో ఏకైక సెలవుదినం డిసెంబర్ 25 (క్రిస్మస్). ఆ రోజు మార్కెట్ మూసి ఉంటుంది.

అదనంగా, స్టాక్ మార్కెట్ నెలలోని నాలుగు శనివారాలు అంటే 'డిసెంబర్ 6, డిసెంబర్ 13, డిసెంబర్ 20, డిసెంబర్ 27, నాలుగు ఆదివారాలు అంటే 'డిసెంబర్ 7, డిసెంబర్ 14, డిసెంబర్ 21, డిసెంబర్ 28' తేదీల్లో మూసి ఉంటుంది.

దీని వలన సంవత్సరం ముగిసే ముందు డిసెంబర్‌లో పెట్టుబడిదారులకు మొత్తం 22 ట్రేడింగ్ సెషన్‌లు లభిస్తాయి. 2025 సంవత్సరంలో BSE, NSE మొత్తం 14 సెలవులను పాటించాయి.

నవంబర్ 28 శుక్రవారం నాడు భారత స్టాక్ మార్కెట్ దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. ఎందుకంటే పెట్టుబడిదారులు అధిక స్థాయిలలో లాభాలను బుక్ చేసుకున్నారు. GDP (Q2) డేటా కంటే ముందు జాగ్రత్తగా తమ వైఖరిని కొనసాగించారు.




