జగ్గంపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అభ్యర్థి పేరు మొత్తం ఓట్లు పార్టీ స్థితి
Jyothula Nehru 113593 TDP Won
Thota Narasimham 60917 YSRCP Won
Patamsetti Surya Chandra 12531 IND Won
Marothi Siva Ganesh 1457 INC Won
Juthuka Nageswara Rao 696 BSP Won
Kaldari Rani 595 IND Won
Sadhe Narendra Babu 474 LIBCP Won
Dr Sankumalla Apparao 329 IND Won
Boddeti Apparao 298 IND Won
Balireddy Solomon Raju 287 IND Won
Dommeti Kusalanna 275 IND Won
Kothapalli Suribabu 262 RPI (K) Won
Valluri Satyanandam 251 JRBHP Won
Chitturi Naga Lakshmi 86 PPOI Won
జగ్గంపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజవర్గాల్లో జగ్గంపేట ఒకటి. కాకినాడ జిల్లాలోని ఒక నియోజకవర్గం ఈ జగ్గంపేట. ఇది కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. జ్యోతుల నాగ వీర వెంకట విష్ణు సత్య మార్తాండ రావు(చంటిబాబు) జగ్గంపేట ప్రస్తుత ఎమ్మెల్యే. ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 211,402 మంది ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ ఆర్డర్స్(1955) ప్రకారం 1955లో నియోజకవర్గం స్థాపించబడింది. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గోకవరం, జగ్గంపేట, గండేపల్లె, కిర్లంపూడి నాలుగు మండలాలుగా ఉన్నాయి. ఇక ఈ నియోజవర్గంలో 1955 నుంచి 2019 ఎన్నికల వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ, రెండుసార్లు టీడీపీ పార్టీ, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్ధులు, ఒక్కసారి వైసీపీ పార్టీ అభ్యర్ధి గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తోట నరసింహం, 2014లో వైసీపీ పార్టీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ, 2019లో మళ్లీ వైసీపీ పార్టీకి చెందిన జ్యోతుల చంటిబాబు జగ్గంపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

తిరుపతి లడ్డూ కల్తీపై ఘాటుగా స్పందించిన ఖుష్బూ

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి లడ్డూ కల్తీ కావడం పట్ల తిరుపతిని శుద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నటి ఖుష్బూ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఎక్స్‌లో ఆమె తను అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈవీఎంలపై వైసీపీ - కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌..

ఏపీలో ఈవీఎం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ- కూటమి నేతల మధ్య డైలాగ్‌ వార్‌ పీక్స్‌కు చేరింది. ఈవీఎం రీ -వెరిఫికేషన్‌కు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. ఫలితాలు ప్రకటించిన రెండు నెలలకు అనుమానాలా ! అన్ని ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులు. ఫిర్యాదు సరే మరి ఈసీ రియాక్షన్‌ ఏంటి?

నిలిచిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ.. బాలినేని కీలక వ్యాఖ్యలు..

ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన 12 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్‌ ప్రకారం రీవెరిఫికేషన్‌ జరగడం లేదంటూ మాక్‌ పోలింగ్‌కు హాజరైన వైసీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీవెరిఫికేషన్‌ ప్రక్రియను బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు.

లక్కీ ఛాన్స్ కొట్టేస్తున్న మహిళా టీచర్లు..!

ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్‌పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు.

'వెల్‌కమ్‌ చీఫ్'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మనోజ్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఏపీ క్యాబినేట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవి దక్కింది. వీటితో పాటు పవన్ ఆశించిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అలాగే పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను జనసేన అధినేతకు అప్పగించారు.

మహిళలా మజాకా.. దేశంలో 33శాతం రిజర్వేషన్ లేకుండానే 55శాతం విజయం..

చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ దశాబ్దాలుగా మహిళలు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోయినా ఆ జిల్లాలో మాత్రం 55% శాతం మహిళలే చట్టసభలకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఆ జిల్లాను నడుపుతున్న అధికారులు సైతం మహిళలే కావటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకీ 50 శాతం దాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడ మహిళలు ఎవరు? అనుకుంటున్నారా? అదే ఒకప్పుడు గజపతిరాజులు ఏలిన విజయనగరం.

ఏపీ ఫలితాల తర్వాత వైసీపీకి మరో అగ్నిపరీక్ష.. రంగంలోకి కీలక నేతలు

ఎన్నికలు ముగిశాయి. కూటమికి అనూహ్య విజయం లభించింది. కనీవిని ఎరుగని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలను దక్కించుకున్న కూటమి తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎ల పై దృష్టి సారించాయి. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్‎లు వైసిపి నాయకత్వంలోనే ఉన్నాయి. వాటిన్నంటిపై దృష్టిసారించింది కూటమి. ముందుగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‎పై కూటమి నేతలు దృష్టి సారించారు. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 7 మంది ఎమ్మెల్యేలకు గానూ విశాఖ నగరం పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నాయి.

ఆవిధంగా వ్యవహరిస్తారని తానెప్పుడూ అనుకోలేదు.. ఈ అధికారులపై ఫోకస్

తన పరిపాలన ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ మీటింగ్‌లోనే శాంపిల్‌ చూపించారు సీఎం చంద్రబాబు. తన ప్రాధాన్యతలేంటో, ప్రజలు ఆకాంక్షలు, ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పుకొచ్చారు. అదే టైమ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లపై హాట్‌ కామెంట్స్‌ చేశారు చంద్రబాబు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే అఖిలభారత సర్వీస్‌ అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు. పాలనలో కీలకమైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో కాసేపు మాట్లాడారు. తనపై ఎంతో పెద్ద బాధ్యత ఉందంటూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Srikar T
  • Updated on: Jun 14, 2024
  • 6:15 AM

పవర్ స్టార్ ఫ్యాన్ అంటే మామూలుగా ఉండదు.. శపథం చేసి చివరకు..

ఈ ఫోటోలో ఉన్నది ఆడా.. మగా అర్ధం కావట్లేదా. మరొక్కసారి బాగా చూడండి అయినా అర్ధం కాకపోతే పూర్తి వివరాలు చదవాలి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఇతని పేరు తోట నరేంద్ర. ఊరు.. తెనాలి సమీపంలోని కొలకలూరు. అది 2019వ సంవత్సరం.. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అతని అభిమాన నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో నరేంద్ర తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ నాయకుడు రెండు చోట్ల పరాజయం పాలవ్వడం తీవ్ర వేదనకు గురి చేసింది.

40 శాతం ప్రజలు మనవైపే.. ప్రలోభాలకు లొంగొద్దు: జగన్ కీలక వ్యాఖ్యలు

శాసనసభలో నోరు కట్టడి చేసే అవకాశం ఉంది... శాసనమండలిలోనైనా గట్టిగా ప్రభావం చూపాలని వైసీపీ ఎమ్మెల్సీలకు ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని.. కేసులు పెట్టినా భయపడొద్దు.. అంటూ సూచించారు. గురువారం వైఎస్‌ జగన్‌‌ వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..