ఒకే ఒక్క ఓటు సీఎం పదవికి దూరం చేసింది.!

TV9 Telugu

26 May 2024

ఇటీవల మే 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు, తెలంగాణలోని లోకసభ ఎన్నికలు జరిగాయి.

జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీని తర్వాత ఎవరు గెలవనున్నారో తెలుస్తుంది. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకం.

2008లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో నిలబడి రేసులో ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు.

నాథ్‌ద్వారా అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషికి 62,215 ఓట్లు పడగా, ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ‌ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి.

దీంతో రీకౌంటింగ్ కోరగా మళ్లీ ఓట్లను లెక్కించినప్పటికీ ఏవ్ ఫలితాలు వచ్చాయి. దింతో కల్యాణ్ సింగ్‌ విజేతగా నిలిచారు.

అయితే, కల్యాణ్ సింగ్ చౌహాన్ భార్య రెండు చోట్ల ఓటు వేసి టెండర్డ్ ఓటింగ్ కి పాల్పడ్డారని సీపీ జోషి రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

హైకోర్టులో చుక్క ఎదురవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశంతో రీకౌంటింగ్ నిర్వహించగా  సమాన ఓట్లు రావడంతో డ్రాలో కల్యాణ్ సింగ్‌ను విజేతగా ప్రకటించింది.

2004లో కర్ణాటకలోని సంతేమరహళ్లి అసెంబ్లీ స్థానంలో కృష్ణమూర్తికి 40,751 ఓట్లు, ధ్రువనారాయణకు 40,752 ఓట్లు రావడంతో కృష్ణమూర్తికి గెలుపు దూరమైంది.