ఇద్దరికి సమన ఓట్లు వస్తే.. ఏమి చేస్తారు.?

TV9 Telugu

22 May 2024

జూన్ 4న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు ఎన్నికల అధికారులు.

ఇందులో ఎవరైన ఇద్దరికీ సమానం ఓట్లు వస్తే ఏమి చేస్తారో చాలా మందికి తెలియదు. ఎవరు విజేత అవుతారో తెలుసుకుందాం.

సమాన ఓట్లు వచ్చినప్పుడు వారి ఎవరు గెలుస్తారో నిర్ణయించడానికి ఒక విధానం ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ నిర్వహిస్తుంది.

దీని కోసం టాస్ వేసి విజేతను ఎవరన్నది నిర్ణయిస్తారు అధికారులు. ఎవరు గాలిస్తే వారే అక్కడ సీట్ కైవసం చేసుకుంటారు.

ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే ఏమవుతుందనే దానిపై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి రాజ్యాంగ నియమము లేదు.

ఇప్పటివరకు ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముగ్గురికి సమానంగా వచ్చినవి కనిపించలేదు.

ఇద్దరికి సమానంగా వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు.  ఓట్ల లెక్కింపులో ఏదైనా వ్యత్యాసం ఉందని అభ్యర్థి భావిస్తే రీ కౌంటింగ్ కూడా కోరవచ్చు.