Telangana: స్థానిక ఎన్నికల సమరానికి వేళాయే.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ సీఎస్ రామకృష్ణారావుతోపాటు ఉన్నతాధికారులతో కీలక భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఎలక్షన్ బందోబస్తు, రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ముందుగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.. అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్.. అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయని ఎస్ఈసీ తెలిపింది.. మొదటగా రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
– 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణ
– 5749 ఎంపీటీసీలు.. 565 జెడ్పీటీసీలు..
– మొత్తం గ్రామ పంచాయితీలు 12,733
– మొత్తం వార్డులు 1,12, 288
– రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
– మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
– అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
– అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
– నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

