ఎన్నికల్లో ఏన్ని ఓట్లు రాకుంటే డిపాజిట్ గల్లంతు..!

TV9 Telugu

25 May 2024

డిపాజిట్‌.. ఎన్నికల సమయంలో ఎక్కువగా వినిపించే పదం. అయితే ఇది ఏంటనేది కొంతమందికి మాత్రమే తెలుసు. దీని గురించి తెలుసుకుందాం.

ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించే రోజు డిపాజిట్‌ గురించి చర్చ జరుగుతుంది. వీరు డిపాజిట్‌ కోల్పోయారు అని వింటాం.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ అప్పుడు ఎల్లెక్షన్ కమిషన్ ఫిక్స్ చేసిన రుసుమును రిటర్నింగ్‌ అధికారి వద్ద డిపాజిట్‌ చేయాలి.

ఓట్లు లెక్కించి ఫలితాలన వెల్లడించిన తర్వాత దీన్ని తిరిగి ఇస్తారు. దీనికోసం అభ్యర్థి ఆరో వంతు అంటే 16 శాతం ఓట్లు పొందాలి.

ఇచ్చిన సమయానికి ముందే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే సొమ్మును తిరిగి పొందవచ్చు. లేదంటే ఆ రుసుం ఈసీ ఖాతాలోకి చేరుతుంది.

గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన పార్టీ సహా స్వతంత్ర అభ్యర్థులు సైతం చాల సార్లు పలువురు డిపాజిట్‌లు కోల్పాయారు.

ఎన్నికల సంఘం ప్రకారం 1951 - 2019 మధ్య వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో 91,160 అభ్యర్థుల్లో 71,245 అంటే 78 శాతం మంది డిపాజిట్‌లు కోల్పోయారు.

1957లో అతి తక్కువగా 130 మంది ఉండగా, 1996లో అత్యధికంగా 12,688 మందికి, 2019 ఎన్నికల్లో 610 మందికి డిపాజిట్‌లు కోల్పోయారు.