AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubilee Hills Bypoll: డ్రోన్ కెమెరాలతో జూబ్లీహిల్స్ ఓటింగ్ పర్యవేక్షణ

Jubilee Hills Bypoll: డ్రోన్ కెమెరాలతో జూబ్లీహిల్స్ ఓటింగ్ పర్యవేక్షణ

Yellender Reddy Ramasagram
| Edited By: Phani CH|

Updated on: Nov 11, 2025 | 12:34 PM

Share

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. పోలింగ్ కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, పార్టీ నేతల గుమిగూడటం లేదా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే అధికారులకు, పోలీసులకు సమాచారం అందిస్తున్నారు. దీనివల్ల ఎన్నికలు సజావుగా సాగేలా చూడటం లక్ష్యం.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈసారి పోలింగ్ కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. అధికారుల సమన్వయంతో ప్రతి కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. యూసఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద డ్రోన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో టీవీ9 కెమెరా ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. ఓటర్ల క్యూ లైన్లతో పాటు రోడ్లపై ఎవరైనా పార్టీ నేతలు లేదా ప్రజలు గుమిగూడుతున్నారా అనే సమాచారాన్ని డ్రోన్ల ద్వారా సేకరిస్తున్నారు. వివరాలను వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్లామర్ షో చాలు.. ఇక నటిస్తామంటున్న కుర్ర హీరోయిన్లు

Pawan Kalyan: కథలు రెడీ.. పవన్ రెడీగా ఉన్నారా

ముంబైలోనే సెటిల్ అవ్వాలని చూస్తున్న ఆ హీరోయిన్లు

వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు

హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు