ఈ-ఓటర్ ఐడీ ఎలా డౌన్లోడ్ చేయాలంటే.?

TV9 Telugu

09 May 2024

ఆంధ్రలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి.రెండు రాష్ట్రాల్లో మే 9తో ప్రచారం కూడా ముగిసింది.

ఎన్నికల్లో ఓటు వేయాలంటే.. ఓటర్ ఐడీ లేదా ఏదైన భారతీయ ఐడి క్రేడ్ ఉన్న మీరు ఈ ఎన్నికల్లో ఓటు వెయ్యవచ్చు.

అయితే ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ఈ- ఓటరు గుర్తింపు కార్డు ద్వారా కూడా తమ ఓటును వినియోగించుకోవచ్చు.

ఈ-ఓటర్ ఐడీని కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మొబైల్ నంబర్ సాయంతో క్షణాల్లోనే పొందవచ్చు.

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం వెబ్‌సైట్ లో ఉపయోగించే ఫామ్ -8నే ఈ-ఓటర్ కార్డు కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫామ్‌లో మొబైల్ నంబర్ కోసం ఏర్పాటు చేసిన కాలమ్ క్లిక్ చేసిన తర్వాత నెంబర్ సబ్‌మిట్ చేయాలని తెలిపారు.

తర్వాత వచ్చిన e-epic విభాగంలోకి వెళ్లి నిర్ధేశించిన చోట ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి.

తర్వాత మీ మొబైల్ నంబర్ నంబర్‌కు వెంటనే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే చాలు ఈ-ఓటర్ గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.