AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN.. విద్యార్థుల చదువును ట్రాక్ చేసే అవకాశం

తెలంగాణలో ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లపై 'పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (PEN)'ను ముద్రించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు జారీ చేసే ధ్రువపత్రాలపై 11 అంకెల PEN నంబర్‌ కనిపించనుంది. ఇప్పటివరకు విద్యార్థులు ఇంటర్‌ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారా? చదువు మధ్యలోనే ఆపేశారా? ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదువుతున్నారా? అనే విషయాలను తెలుసుకునేందుకు సమగ్రంగా ట్రాక్‌ చేసే విధానం లేదు..

ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN.. విద్యార్థుల చదువును ట్రాక్ చేసే అవకాశం
PEN Number to Be Printed on Inter Certificates
Srilakshmi C
|

Updated on: Oct 07, 2026 | 7:10 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 7: ఇకపై PEN ద్వారా విద్యార్థుల విద్యా ప్రగతిని గుర్తించే అవకాశం ఏర్పడనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి UDISE+ పోర్టల్‌ ద్వారా PEN నంబర్‌ను కేటాయిస్తున్నారు. విద్యార్థి విద్యా ప్రస్థానానికి సంబంధించిన వివరాలను గుర్తించేందుకు ఈ నంబర్‌ ఉపయోగపడుతుంది. పదో తరగతి మార్కుల మెమోలపై 2024 నుంచి PENను ముద్రిస్తున్నారు. అయితే ఈ నంబర్‌ను ఇంటర్‌ బోర్డు సమగ్ర శిక్షా నుంచి తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటివరకు ఇంటర్‌ ధ్రువపత్రాలపై ముద్రించడం లేదు. ఇకపై ఇంటర్‌ సర్టిఫికెట్లపైనా PENను ముద్రించాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సుమారు 9.75 లక్షల మంది ఉన్నారు. వీరి ఇంటర్‌ ధ్రువపత్రాలపై PENను ముద్రించనున్నారు. దీంతో విద్యార్థి పాఠశాల విద్య నుంచి ఇంటర్‌, ఆ తర్వాత ఉన్నత విద్య వరకు కొనసాగుతున్న విద్యా వివరాలను అనుసంధానించే అవకాశం మరింత మెరుగుపడనుంది. చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను గుర్తించడం, ఇతర రాష్ట్రాలకు వెళ్లి విద్యను కొనసాగిస్తున్న వారి వివరాలను తెలుసుకోవడం వంటి అంశాల్లో ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంది. విద్యార్థుల విద్యా ధ్రువపత్రాలను డిజిటల్‌గా భద్రపరచేందుకు ఇంటర్‌ బోర్డు మరో కీలక చర్య తీసుకుంది. డిజిలాకర్‌ ఏజెన్సీతో ఇంటర్‌ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు లేదా ఇతర కారణాల వల్ల విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు దెబ్బతినకుండా లేదా పోకుండా వాటిని డిజిటల్‌ రూపంలో భద్రపరచుకునే అవకాశం ఉంటుంది.

అపార్‌ ఐడీతో డిజిలాకర్‌లో సర్టిఫికెట్ల భద్రత

విద్యార్థులకు APAR (APAAR) ID పేరిట 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా విద్యార్థుల విద్యా రికార్డులను డిజిటల్‌గా అనుసంధానించవచ్చు. విద్యార్థులు స్వయంగా APAAR పోర్టల్‌ ద్వారా ఐడీని పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఆధార్‌ నంబర్‌ అవసరం. విద్యాసంస్థల ద్వారా APAAR ID పొందాలంటే ఆధార్‌ వివరాలతో పాటు తల్లిదండ్రుల సమ్మతి కూడా అవసరం. APAAR ID ఉంటేనే విద్యార్థుల సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో భద్రపరచుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ఇంటర్‌ విద్యార్థుల్లో ప్రస్తుతం సుమారు 82 నుంచి 85 శాతం మందికి APAAR ID ఉందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మిగిలిన విద్యార్థులకు కూడా త్వరలో APAAR ID ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. డిజిలాకర్‌లో కేవలం విద్యా ధ్రువపత్రాలనే కాకుండా ఇతర ముఖ్యమైన పత్రాలను కూడా భద్రపరచుకోవచ్చు. ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాలను కూడా డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచుకోవచ్చు. PEN, APAAR ID, డిజిలాకర్‌ వంటి వ్యవస్థలను అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థుల విద్యా వివరాలను డిజిటల్‌గా నిర్వహించేందుకు మరింత మెరుగైన అవకాశం ఏర్పడనుంది. ఒకవైపు PEN ద్వారా విద్యార్థి విద్యా ప్రయాణాన్ని గుర్తించేందుకు వీలు కలుగుతుండగా, మరోవైపు APAAR ID, డిజిలాకర్‌ ద్వారా సర్టిఫికెట్లను డిజిటల్‌గా భద్రపరచుకోవచ్చు. దీంతో విద్యార్థుల విద్యా రికార్డుల నిర్వహణ మరింత సులభతరం కావడంతో పాటు, సర్టిఫికెట్లు పోయినా లేదా దెబ్బతిన్నా వాటిని డిజిటల్‌గా పొందే అవకాశం లభించనుంది.

Follow Us
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?