IPL 2026: ఐపీఎల్ నుంచి రూ. 92 కోట్లు.. కట్‌చేస్తే.. వేలం నుంచి డేంజరస్ ప్లేయర్ ఔట్..
Glenn Maxwell out of IPL: ఐపీఎల్ 2025 మెగా వేలానికి మొత్తం 1,355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ లేకపోవడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆరు సీజన్లపాటు పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.

Glenn Maxwell out of IPL: ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ 16న జరగనుంది. దీని కోసం 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా, ఐపీఎల్ నుంచి రూ. 92 కోట్లు సంపాదించిన ఆటగాడిని రిజిస్టర్డ్ ఆటగాళ్ల జాబితాలో చేర్చలేదు. ఐపీఎల్ 2026కి దూరంగా ఉండాలనే నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఐపీఎల్ 2026 వేలంలో అతను తన పేరును నమోదు చేసుకోలేదు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ నుంచి దూరంగా ఉన్నట్లు తేలిసింది.
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున..
గ్లెన్ మాక్స్‌వెల్ IPL 2025లో పంజాబ్ కింగ్స్‌లో భాగమయ్యాడు . ఫ్రాంచైజీ అతన్ని రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, IPL 2026 వేలానికి ముందు, పంజాబ్ ఫ్రాంచైజ్ మాక్స్‌వెల్‌ను విడుదల చేసింది. మాక్స్‌వెల్ విడుదలైన తర్వాత, చాలా ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి. అయితే, వేలంలో నమోదు చేసుకోకపోవడం ద్వారా, మాక్స్‌వెల్ తాను IPL 2026లో ఆడనని స్పష్టం చేశాడు.
మాక్స్వెల్ నిర్ణయం వెనుక కారణం?
ఐపీఎల్ 2026 కోసం మాక్స్వెల్ రిజిస్టర్ చేసుకోకూడదనే నిర్ణయం వెనుక గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఐపీఎల్ 2026 వేలంలో పాల్గొనకూడదనే తన నిర్ణయాన్ని మాక్స్వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ప్రకటించాడు. ఇది ఒక పెద్ద నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ తాను క్రికెటర్‌గా ఎదగడానికి సహాయపడింది. అయితే, వేలంలో ఎందుకు పాల్గొనలేదో ఆయన వివరించలేదు. మాక్స్వెల్ చివర్లో తన అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
ఐపీఎల్ నుంచి దాదాపు రూ. 92 కోట్లు..
View this post on Instagram
మాక్స్వెల్ నాలుగు జట్ల తరపున IPLలో మొత్తం 13 సీజన్లు ఆడాడు. అతను 2012లో IPLలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అతను IPL నుంచి సుమారు రూ. 92 కోట్లు సంపాదించాడు. IPL 2021లో RCB కొనుగోలు చేసినప్పుడు మాక్స్వెల్ తన అత్యధిక జీతం రూ. 14.25 కోట్లు అందుకున్నాడు. మాక్స్వెల్ అత్యధిక IPL సీజన్లు ఆడాడు. ఆరు సీజన్లపాటు పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








