AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖానికి 7 కుట్లు.. కట్‌చేస్తే.. 19 సిక్సర్లు, 32 ఫోర్లతో 376 పరుగులు.. బౌలర్లకు మెంటలెక్కించిన యూవీ 2.0

Men’s U-23 State A Trophy 2025-26: క్యాచ్ తీసుకుంటూ తీవ్ర గాయం అయింది. దీంతో ముఖంపై ఏడు కుట్లు పడ్డాయి. అయితే, అతను ఇప్పుడు అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో బ్యాట్, బాల్ రెండింటితోనూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకన్నాడు. దీంతో టోర్నమెంట్ హీరోగా ఎదిగాడు. ఇది యువరాజ్ సింగ్ అభిమాని, ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ ప్రశాంత్ వీర్ కథ.

ముఖానికి 7 కుట్లు.. కట్‌చేస్తే.. 19 సిక్సర్లు, 32 ఫోర్లతో 376 పరుగులు.. బౌలర్లకు మెంటలెక్కించిన యూవీ 2.0
Prashant Veer
Venkata Chari
|

Updated on: Dec 02, 2025 | 11:38 AM

Share

Men’s U-23 State A Trophy 2025-26: క్రికెట్‌లో గాయాలు సహజం. కానీ ఆ గాయాలను లెక్కచేయకుండా, తిరిగి మైదానంలోకి వచ్చి అద్భుతాలు సృష్టించేవారే నిజమైన హీరోలు. ఉత్తర ప్రదేశ్ యువ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ సరిగ్గా ఇదే చేసి చూపించాడు. ఇటీవల జరిగిన మెన్స్ అండర్-23 స్టేట్ ఏ ట్రోఫీ (Men’s U-23 State A Trophy)లో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఫైనల్లో ఓడినా ‘హీరో’గా నిలిచాడు..

ఈ టోర్నీ ఫైనల్‌లో ఉత్తర ప్రదేశ్ జట్టు తమిళనాడు చేతిలో ఓటమి పాలై ఉండవచ్చు. కానీ, టోర్నమెంట్ మొత్తం తన భుజాలపై మోసిన ప్రశాంత్ వీర్ మాత్రం ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. బ్యాటింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించడమే కాకుండా, బౌలింగ్‌లోనూ వికెట్లు తీసి ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు.

19 సిక్సర్లతో విధ్వంసం..

యువరాజ్ సింగ్‌ను ఆరాధించే ప్రశాంత్ వీర్, మైదానంలో తన ఐడల్ లాగే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన ప్రశాంత్, ఏకంగా 376 పరుగులు సాధించాడు. అందులో 19 భారీ సిక్సర్లు, 32 ఫోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అతని బ్యాటింగ్ సగటు 94 కాగా, ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టోర్నీలో అతని అత్యధిక స్కోరు 87 పరుగులుగా నిలిచింది.

18 వికెట్లతో బౌలింగ్‌లోనూ సూపర్ హిట్..

కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, తన బౌలింగ్‌తోనూ ప్రశాంత్ మ్యాజిక్ చేశాడు. టోర్నీలో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ సగటు 18.77 కాగా, ఎకానమీ 5.36గా నమోదైంది. ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు, మరో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు.

జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా, టోర్నీ టాప్-3 బౌలర్లలో ఒకడిగా..

గాయాన్ని జయించి.. ప్రశాంత్ వీర్ ఈ స్థాయి ప్రదర్శన చేయడం వెనుక పెద్ద పోరాటమే ఉంది. కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగిన ఒక మ్యాచ్‌లో క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో తోటి ఆటగాడిని ఢీకొట్టాడు. దీంతో అతని ముఖానికి తీవ్ర గాయమై, 7 కుట్లు పడ్డాయి. ఆ గాయం కారణంగా కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ, ఆ నొప్పిని అధిగమించి తిరిగి వచ్చిన ప్రశాంత్.. అండర్-23 ట్రోఫీలో బంతి, బ్యాట్ రెండింటితోనూ అద్భుత ప్రదర్శన చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

తన జెర్సీ నంబర్ 12 వేసుకుని, యువరాజ్ సింగ్ లాగే ఆడే ఈ యువకెరటం ఉత్తర ప్రదేశ్ క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..