PBKS Retention List: టీ20లోనే మోస్ట్ డేంజరస్ ప్లేయర్‌ను పక్కన పెట్టిన పంజాబ్.. పూర్తి లిస్ట్ ఇదే
Punjab Kings Retained and Released Players Full List: శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ సీజన్‌లో తన అత్యుత్తమ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో లీగ్‌లో బలమైన జట్లలో ఒకటిగా పేరుగాంచేందుకు పీబీకేఎస్ సిద్ధమైంది.

Punjab Kings Retained and Released Players Full List: గత సీజన్ (IPL 2025)లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, కేవలం ఆరు పరుగుల తేడాతో టైటిల్‌ను కోల్పోయిన పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు, ఐపీఎల్ 2026 కొత్త సీజన్ కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలో మంచి సమతుల్యత కనిపించినా, రన్నరప్ జట్టు కొందరు కీలక ఆటగాళ్లను విడుదల చేయడం గమనార్హం.
రిటెన్షన్ విండో ముగిసిన సందర్భంగా పంజాబ్ కింగ్స్ ప్రకటించిన కొత్త స్క్వాడ్ వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా (Retained Players)..
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ జట్టు స్థిరమైన కోర్‌ను కొనసాగించడానికి రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..
శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) (కెప్టెన్)
మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis)
యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)
అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)
నెహాల్ వధేరా (Nehal Wadhera)
ప్రియాంష్ ఆర్య (Priyansh Arya)
ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh)
శశాంక్ సింగ్ (Shashank Singh)
పైలా అవినాష్ (Pyla Avinash)
హర్నూర్ పన్ను (Harnoor Pannu)
ముషీర్ ఖాన్ (Musheer Khan)
విష్ణు వినోద్ (Vishnu Vinod)
అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai)
సూర్యాన్ష్ షెడ్గే (Suryansh Shedge)
మిచెల్ ఓవెన్ (Mitchell Owen)
విజయ్‌కుమార్ వైశాక్ (Vijaykumar Vyshak)
యశ్ ఠాకూర్ (Yash Thakur)
జేవియర్ బార్ట్‌లెట్ (Xavier Bartlett)
లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson)
హర్‌ప్రీత్ బ్రార్ (Harpreet Brar)
విడుదలైన ఆటగాళ్ల జాబితా (Released Players)..
పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఉండటం పెద్ద నిర్ణయం.
గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell)
జోష్ ఇంగ్లిస్ (Josh Inglis)
ఆరోన్ హార్డీ (Aaron Hardie)
కుల్దీప్ సేన్ (Kuldeep Sen)
ప్రవీణ్ దూబే (Praveen Dubey)
మిగిలిన పర్స్ వివరాలు (Purse Remaining)..
గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా పంజాబ్ కింగ్స్ వేలం పర్స్‌ను పెంచుకుంది.
వేలం బడ్జెట్ (Auction Budget): రూ. 11.50 కోట్లు
పంజాబ్ కింగ్స్ తమ కీలకమైన భారతీయ, విదేశీ ఆటగాళ్లను నిలబెట్టుకుంది. మిగిలిన బడ్జెట్‌తో మినీ-వేలంలో జట్టుకు అవసరమైన కీలక ప్లేయర్లను భర్తీ చేయాలని చూస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




