LSG Retention List: ఆ లోపాన్ని సరిదిద్దిన పంత్ టీం.. టీమిండియా స్టార్ పేసర్ ఎంట్రీతో డేంజరస్‌గా లక్నో
Lucknow Super Giants Retained and Released Players Full List: గత రెండు సీజన్లలో (IPL 2024, 2025) పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచి నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు, ఐపీఎల్ 2026లో తమ అదృష్టాన్ని మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Lucknow Super Giants Retained and Released Players Full List: గత రెండు సీజన్లలో (IPL 2024, 2025) పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచి నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు, ఐపీఎల్ 2026లో తమ అదృష్టాన్ని మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో టీం, రిటెన్షన్ విండో ముగిసిన సందర్భంగా తమ స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈసారి జట్టు తమ అతిపెద్ద లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని ట్రేడ్ ద్వారా తీసుకుంది.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా (Retained Players)..
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు స్థిరమైన కోర్‌ను, ముఖ్యంగా యువ ప్రతిభను నిలబెట్టుకుంటూ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితాను ఓసారి చూద్దాం.
రిషబ్ పంత్ (Rishabh Pant) (కెప్టెన్)
మొహమ్మద్ షమీ (Mohammed Shami) (ట్రేడ్ ద్వారా జట్టులోకి)
అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) (ట్రేడ్ ద్వారా జట్టులోకి)
అబ్దుల్ సమద్ (Abdul Samad)
ఆయుష్ బదోని (Ayush Badoni)
ఐడెన్ మార్క్రమ్ (Aiden Markram)
మిచెల్ మార్ష్ (Mitchell Marsh)
మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke)
నికోలస్ పూరన్ (Nicholas Pooran)
హిమ్మత్ సింగ్ (Himmat Singh)
షాబాజ్ అహ్మద్ (Shahbaz Ahmed)
అర్షిన్ కులకర్ణి (Arshin Kulkarni)
మయాంక్ యాదవ్ (Mayank Yadav)
అవేశ్ ఖాన్ (Avesh Khan)
మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan)
దిగ్వేష్ రాఠీ (Digvesh Rathi)
ఎం సిద్ధార్థ్ (M Siddharth)
ప్రిన్స్ యాదవ్ (Prince Yadav)
ఆకాశ్ సింగ్ (Akash Singh)
విడుదలైన ఆటగాళ్ల జాబితా (Released Players)..
LSG జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
డేవిడ్ మిల్లర్ (David Miller)
రవి బిష్ణోయ్ (Ravi Bishnoi)
ఆకాష్ దీప్ (Akash Deep)
ఆర్యన్ జుయల్ (Aryan Juyal)
షామర్ జోసెఫ్ (Shamar Joseph)
యువరాజ్ చౌదరి (Yuvraj Chaudhary)
రాజ్వర్ధన్ హంగేర్కర్ (Rajvardhan Hangargekar)
ట్రేడ్ అయిన ఆటగాడు (Player Traded Out)..
శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) (ముంబై ఇండియన్స్ (MI)కి ట్రేడ్ అయ్యాడు).
మిగిలిన పర్స్ వివరాలు (Purse Remaining)..
మొహమ్మద్ షమీ వంటి స్టార్ పేసర్‌ను ట్రేడ్ ద్వారా తీసుకున్నప్పటికీ, లక్నోకి మినీ-వేలంలో ఖర్చు చేయడానికి మంచి బడ్జెట్ మిగిలి ఉంది.
వేలం బడ్జెట్ (Auction Budget): రూ. 22.95 కోట్లు
భారతీయ పేస్ దళాన్ని షమీతో బలోపేతం చేసుకున్న లక్నో, మిగిలిన పర్స్‌తో తమ విదేశీ కోర్‌ను, మిడిల్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




