IPL 2026 : ఐపీఎల్ 2026 రిటెన్షన్స్.. ట్రేడింగ్ విండోలో సంచలనం..విడుదల కానున్న స్టార్ ప్లేయర్స్
క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ పై ఉన్నా, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మాత్రం ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ ప్రకటన కోసమే. అనేక రోజుల ఊహాగానాలకు, వదంతులకు తెర దించుతూ నేడు (నవంబర్ 15, శనివారం) సాయంత్రం 5 గంటలలోపు ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించనున్నారు.

IPL 2026 : క్రికెట్ అభిమానుల దృష్టి ప్రస్తుతం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ పై ఉన్నా, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మాత్రం ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ ప్రకటన కోసమే. అనేక రోజుల ఊహాగానాలకు, వదంతులకు తెర దించుతూ నేడు (నవంబర్ 15, శనివారం) సాయంత్రం 5 గంటలలోపు ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను ప్రకటించనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ వరకు.. 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను విడుదల చేస్తాయి.
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ లిస్ట్ ప్రకటించడానికి నేడు (నవంబర్ 15) సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తుంది. దీంతో అనేక రోజులుగా కొనసాగుతున్న ఆటగాళ్ల ట్రేడింగ్, రిటెన్షన్ చర్చలకు తెర పడనుంది. ఈరోజు సాయంత్రం 10 ఫ్రాంచైజీలు విడుదల చేసే జాబితాలో, కొందరు స్టార్ ఆటగాళ్ల పేర్లు అభిమానులకు నిరాశ కలిగించే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ శనివారం సాయంత్రం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యేకంగా వెల్లడి కానున్నాయి.
ప్రస్తుత ఐపీఎల్ సైకిల్‌లో (3 సంవత్సరాల సైకిల్) ఇది రెండవ సీజన్ కాబట్టి, ఈసారి జరగబోయేది మినీ ఆక్షన్. దీనివల్ల ఈసారి రిటెన్షన్ నియమాలు మెగా ఆక్షన్ (2025లో జరిగింది) కంటే భిన్నంగా ఉంటాయి. ఈసారి ఫ్రాంచైజీలకు తమకు నచ్చినంత మంది ఆటగాళ్లను రిటైన్ (అట్టిపెట్టుకునేందుకు) చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. దీని అర్థం గత మెగా ఆక్షన్ తరహాలో ఐదు లేదా ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవాలనే నిబంధన లేదు. విడుదల చేసిన లేదా ట్రేడ్ చేసిన ఆటగాళ్ల మొత్తం ఆయా జట్ల ఆక్షన్ పర్స్‌కు జమ అవుతుంది.
రిటెన్షన్‌కు ముందే ఈసారి ట్రేడింగ్ విండోలో చాలా చర్చ జరిగింది. సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శామ్ కరన్‌ల ట్రేడ్‌పై పెద్ద ఎత్తున వదంతులు వచ్చినా, తుది ప్రకటన రాలేదు. అయితే, కొన్ని ట్రేడ్‌లు మాత్రం అధికారికంగా పూర్తయ్యాయి. శార్దూల్ ఠాకూర్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ఇండియన్స్ కి (రూ.2 కోట్లకు ట్రేడ్), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కి (రూ.2.6 కోట్లకు ట్రేడ్), మహ్మద్ షమీ (SRH నుంచి LSG), అర్జున్ టెండూల్కర్ (MI నుంచి LSG), మయాంక్ మార్కండే (KKR నుంచి MI) వంటి ఇతర ట్రేడ్‌లు కూడా నేడు ఖరారయ్యే అవకాశం ఉంది.
రిలీజ్ అయ్యే ఆటగాళ్లలో కొందరు పెద్ద పేర్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత మెగా ఆక్షన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకరైన వెంకటేష్ అయ్యర్‌ను (రూ.23.75 కోట్లు) కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేయవచ్చు. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై, రచిన్ రవీంద్ర, డెవన్ కాన్వే వంటి ముఖ్య విదేశీ ఆటగాళ్లను వదులుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ నుంచి గ్లెన్ మాక్స్‌వెల్‌ను మరోసారి రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి మహీష్ తీక్షణ, వానిందు హసరంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి లియామ్ లివింగ్‌స్టన్ లాంటి ప్లేయర్స్ కూడా విడుదల జాబితాలో ఉండొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




