AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు!

తొడల మధ్య లేదా గజ్జల్లో తరచూ దురద, మంట, ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయా?.. చెమట, తేమ, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వంటి కారణాలతో ఈ సమస్య రావచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సమస్య మరింత పెరగకుండా ఏం చేయాలో తెలుసుకోండి.

Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు!
Jock Itching
Bhavani
|

Updated on: Aug 15, 2026 | 9:37 PM

Share

వేసవిలోనే కాకుండా వర్షాకాలంలోనూ చెమట, తేమ కారణంగా గజ్జల ప్రాంతంలో దురద సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. బిగుతైన దుస్తులు ధరించడం, ఎక్కువసేపు తడిగా ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే దురద ఉందని వెంటనే ఏదైనా ఇంటి చిట్కా ప్రయోగించడం కంటే చర్మాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.

1. ప్రాంతాన్ని పొడిగా ఉంచండి

స్నానం చేసిన తర్వాత గజ్జల ప్రాంతాన్ని మెత్తని టవల్‌తో పూర్తిగా ఆరబెట్టాలి. చెమట ఎక్కువగా పట్టే వారికి ఈ జాగ్రత్త మరింత అవసరం.

2. బిగుతైన దుస్తులు వద్దు

గాలి ప్రసరణకు అవకాశం లేని బిగుతైన లోదుస్తులు, ప్యాంట్లు సమస్యను మరింత పెంచవచ్చు. వీలైనంత వరకు సౌకర్యవంతమైన, గాలి ప్రసరణకు అవకాశం ఉన్న దుస్తులు ధరించడం మంచిది.

3. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

ప్రతిరోజూ స్నానం చేయడంతో పాటు చెమట పట్టిన తర్వాత దుస్తులను మార్చుకోవాలి. తడి దుస్తులను ఎక్కువసేపు ధరించకూడదు.

4. గోకడం మానేయండి

దురదగా ఉందని పదేపదే గోకడం వల్ల చర్మంపై గీతలు ఏర్పడి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. గోర్లు చిన్నగా ఉంచుకోవడం కూడా ఉపయోగకరం.

5. సొంతంగా స్టెరాయిడ్‌ క్రీములు వాడకండి

దురద తగ్గుతుందని తెలియని క్రీములు, ముఖ్యంగా స్టెరాయిడ్‌ కలిగిన క్రీములను వైద్యుల సలహా లేకుండా ఉపయోగించకండి. ఇవి కొన్ని ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను మరింత తీవ్రం చేయవచ్చు.

6. సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించండి

దురద, ఎర్రదనం, మంట లేదా దద్దుర్లు కొన్ని రోజులుగా కొనసాగుతున్నా.. వ్యాపిస్తున్నా.. వైద్యులను సంప్రదించడం మంచిది. అవసరమైతే వైద్యులు సరైన యాంటీ ఫంగల్‌ చికిత్సను సూచిస్తారు.

గమనిక: గజ్జల్లో దురదకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌తో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా కారణం కావచ్చు. కాబట్టి నిర్ధారణ లేకుండా నిమ్మరసం, వెనిగర్‌, ఇతర పదార్థాలను చర్మంపై నేరుగా రాయడం చేయకండి. లక్షణాలు ఎక్కువగా ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. ఈ కథనం సాధారణ అవగాహన కోసం మాత్రమే. దీనిని ఆధారంగా చేసుకుని తీసుకునే వ్యక్తిగత వైద్య నిర్ణయాలకు మా సంస్థ బాధ్యత వహించదు.

Follow Us