Sangareddy: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం.. లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణలో 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సంగారెడ్డి అంబేడ్కర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఒకేసారి కార్డుల పంపిణీ చేపట్టారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారులకు సేవలు మరింత మెరుగుపడనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు.
రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఒకేసారి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం పెరగడంతో పాటు లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే
స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
రైలు కంపార్ట్మెంట్లో భయానక దృశ్యం!

