AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫంగస్ పట్టిన ఆహారం తింటున్నారా? మీ ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలిస్తే..

మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయట నుండి తెచ్చుకున్న బ్రెడ్‌, ఇతర ఆహార పదార్థాలు తినేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో తయారుచేసిన ఆహారం సురక్షితంగా, పరిశుభ్రంగా ఉంటుంది. కానీ, బయటి ఆహారం తాజాగా ఉందో లేదో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఏ ఆహారమైనా ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతుంది. తేమ తగిలితే దానిపై బూజు పడుతుంది. వర్షాకాలం, శీతాకాలంలో అధిక తేమ కారణంగా బ్రెడ్‌, బేకరీ ఉత్పత్తులు, పండ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఆహారం తినడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

ఫంగస్ పట్టిన ఆహారం తింటున్నారా? మీ ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలిస్తే..
Food PoisoningImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2026 | 9:31 PM

Share

మనం తరచుగా ఇళ్లలో బ్రెడ్, పండ్లు, ఊరగాయలు లేదా కొద్ది రోజులు నిల్వ ఉంచిన వంటకాలపై తెల్లగా లేదా నల్లగా బూజు పట్టడం చూస్తుంటాం. చాలామంది ఫంగస్ పట్టిన భాగాన్ని మాత్రమే తుడిచేసి లేదా కట్ చేసి, మిగిలిన ఆహారాన్ని తినేస్తుంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆహార పదార్థాలపై ఫంగస్ పెరిగినప్పుడు అది మైకోటాక్సిన్స్ అనే ప్రమాదకర రసాయన విష పదార్థాలను విడుదల చేస్తుంది. కంటికి కనిపించే బూజును తొలగించినప్పటికీ, దాని సూక్ష్మ క్రిములు, విషపదార్థాలు ఆహారం లోపలి భాగాల వరకు వ్యాపించి ఉంటాయి. ఫంగస్ సోకిన ఆహారం తినడం వల్ల తక్షణమే క్రింది అసౌకర్యాలు ఎదురవుతాయి.

అలాంటి ఆహారం తినటం వల్ల కడుపునొప్పి, వికారం, వాంతులు, తీవ్రమైన విరోచనాలు సంభవిస్తాయి. ఫంగస్ బీజాలను పీల్చడం లేదా తినడం వల్ల అలెర్జీలు, ఆస్తమా, ముక్కు దబ్బడనడం వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. కొందరిలో చర్మంపై దద్దుర్లు, దురద వంటి ప్రతిచర్యలు కనిపిస్తాయి. నిరంతరం లేదా క్రమం తప్పకుండా మైకోటాక్సిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీర అవయవాలు దెబ్బతింటాయి.

ఇవి కూడా చదవండి

ఫంగస్ లోని విషపదార్థాలను శుద్ధి చేసే క్రమంలో లివర్, మూత్రపిండాలపై తీవ్ర ఒత్తిడిపడి అవి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆస్పర్గిల్లస్ వంటి ఫంగస్ విడుదల చేసే ఆఫ్లాటాక్సిన్ అనే రసాయనం క్యాన్సర్‌కు దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది శరీరం, ఇమ్యూనిటీ వ్యవస్థను బలహీనపరుస్తుంది. కాబట్టి, బ్రెడ్, పండ్లు, పాల ఉత్పత్తులు లేదా వండిన పదార్థాలపై కొద్దిగా బూజు కనిపించినా వాటిని తినకుండా పూర్తిగా పారవేయాలి. ఆహారాన్ని తేమ లేని, శుభ్రమైన ప్రదేశాలలో లేదా ఫ్రిజ్‌లో సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఆహారంపై ఫంగస్ కనిపించినప్పుడు పొదుపు కంటే ఆరోగ్యమే ముఖ్యమని గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us