Dhurandhar Movie: వందల కోట్ల ఆస్తులు.. ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన చావా మూవీలో ఔరంగ జేబు పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు అక్షయ్ ఖన్నా. ఇప్పుడు 'ధురంధర్' సినిమాలోనూ రెహమాన్ డకైట్ అనే విలన్ పాత్ర పోషించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడీ సీనియర్ హీరో.

‘ధురంధర్’ సూపర్ హిట్ సినిమాతో నటుడు అక్షయ్ ఖన్నా క్రేజ్ మరింత పెరిగింది . ఈ సినిమాలో ఆయన నెగటివ్ పాత్ర పోషించారు. విలన్ అయినప్పటికీ హీరోగా కంటే ఆయనకే ఎక్కువగా ప్రశంసలు లభిస్తున్నాయి. మెరుస్తున్నారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో , అక్షయ్ ఖన్నా రెహ్మాన్ డకైట్ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించాడు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా మూవీలో ఔరంగ జేబు పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు అక్షయ్ ఖన్నా. ఇప్పుడు ‘ధురంధర్’ సినిమాలోనూ తన నటనతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడీ సీనియర్ హీరో. కాగా అక్షయ్ ఖన్నా వయసు ఇప్పుడు సుమారు 50 సంవత్సరాలు. అయితే ఇప్పటికీ ఆయన వివాహం చేసుకోలేదు. దానికి ఒక కారణం ఉంది.
అక్షయ్ ఖన్నా గతంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మాట్లాడారు. ‘నాకు బాధ్యతలు వద్దు. నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. నేను ఎవరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం రాకూడదు. నేను నా గురించి మాత్రమే ఆలోచించాలి. నాకు ఈ అద్భుతమైన జీవితం ఉంది. నేను దానిని ఎందుకు నాశనం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు, మీకు సరిపోయే అమ్మాయిని వెతుక్కోవాలి. ఇష్టం లేకపోయినా వివాహం చేసుకోవడం సరైనది కాదు. మీ కుటుంబం వివాహం చేసుకోవాలని మీపై ఒత్తిడి తీసుకురావడం కూడా తప్పే’.
” పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లికి నేను సరైన వ్యక్తిని కాదు. వివాహం అనేది ఒక నిబద్ధత. అది జీవితంలో ఒక పెద్ద మార్పు. మీరు మీ జీవితాన్ని వేరొకరితో పంచుకున్నప్పుడు, మీకు పూర్తి నియంత్రణ ఉండదు. నా జీవితంపై నాకు పూర్తి నియంత్రణ కావాలి’ అని అక్షయ్ ఖన్నా చెప్పారు.
అక్షయ్ ఖన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా కుమారుడు. 2025 నాటికి ఆయన మొత్తం ఆస్తులు రూ.167 కోట్లుగా అంచనా ఉంది. ఆయనకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. అనేక బంగ్లాలు ఆయన పేరు మీద ఉన్నాయి. లగ్జరీ కార్లు ఉన్నాయి. సినిమాల్లో నటించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అక్షయ్ ఖన్నా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా కూడా డబ్బు సంపాదిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








