Year Ender 2025: ప్రపంచంలో అత్యంత అందమైన టాప్-10 హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆ ముద్దుగుమ్మ మాత్రమే
IMDB ప్రతి సంవత్సరం చివర్లో కొన్ని జాబితాలను విడుదల చేస్తుంటుంది. అలా తాజాగా 2025 లో ప్రపంచంలో అత్యంత అందమైన హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియా నుంచి ఒకే ఒక్క హీరోయిన్ కు స్థానం దక్కడం విశేషం.

సినిమా ఇండస్ట్రీలో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిశ్రమలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలంటే అభినయంతో పాటూ అందమూ చాలా ముఖ్యం. కొన్ని సార్లు కేవలం గ్లామర్ నే ప్రాతిపదికన తీసుకుని సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వస్తుంటాయి. అలా ఈ ఏడాది అత్యంత అందమైన హీరోయిన్ల జాబితా ఒకటి రిలీజ్ అయ్యింది. ఐఎమ్ డీబీ లిస్ట్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. ఈ అందాల తారల జాబితాలో ఇండియా నుంచి కేవలం ఒకే ఒక్క హీరోయిన్ కు మాత్రమే స్థానం దక్కింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు ప్లేసుల్లో చైనాకు చెందిన దిల్‌రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు.
ఈ జాబితాలో టాప్-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్ నిలిచారు.
ఇండియా నుంచి ఒకే ఒక్కరు..
కాగా ఈ జాబితాలో ఇండియా నుంచి బాలీవుడ్ అందాల తార కృతి సనన్ మాత్రమే చోటు దక్కించుకుంది. ఆమె ఈ లిస్టులో టాప్-5 ప్లేసులో నిలిచింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న కృతి తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. మహేష్ బాబు నేనొక్కడినే సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల తార ఆ తర్వాత దోచెయ్ సినిమాలోనూ నటించింది. ఇక ప్రభాస్ ఆది పురుష్ సినిమాలో సీతగా నటించి అందరి మన్ననలు అందుకుంది.
ఐఎండీబీ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత అందమైన టాప్-10 హీరోయిన్లు వీరే..
Top 10 Most Beautiful Actresses in the World 2025/26
1. 🇦🇺 Margot Robbie 2. 🇺🇸 Shailene Woodley 3. 🇨🇳 Dilraba Dilmurat 4. 🇰🇷 Nancy McDonie 5. 🇮🇳 Kriti Sanon 6. 🇵🇰 Hania Aamir 7. 🇨🇺/🇪🇸 Ana de Armas 8. 🇬🇧 Emma Watson 9. 🇺🇸 Amber Heard 10. 🇹🇷 Hande Erçel
(Source: IMDb List – Top… pic.twitter.com/DlW1Hj9Pzy
— Infodex (@infodexx) December 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








