AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ‘వార్ 2’ తర్వాత మరో బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్! ఈ సారి ఆ సూపర్ స్టార్ తో కలిసి..

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇండియా స్టార్ హీరో. అతనికి ఇప్పుడు దేశమంతటా గుర్తింపు ఉంది. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా 'వార్ 2' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే ఈమూవీ ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మరో హిందీ సినిమాలో నటించనున్నారని టాక్.

Jr NTR: 'వార్ 2' తర్వాత మరో బాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్! ఈ సారి ఆ సూపర్ స్టార్ తో కలిసి..
Jr NTR
Basha Shek
|

Updated on: Dec 17, 2025 | 7:48 AM

Share

‘RRR’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ క్రమంలోనే ‘వార్ 2’ సినిమా ద్వారా మరోసారి బాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించాడు తారక్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కు బాలీవుడ్ లోనూ భారీ అభిమానులు ఉన్నారు. అయితే ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ సినిమా ‘వార్ 2’ పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరో బాలీవుడ్ స్టార్‌తో కలిసి నటించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి మ్యాన్ ఆఫ్ మాసెస్ నటించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘వార్ 2’ చిత్రాన్ని నిర్మించిన యష్ రాజ్ ఫిల్మ్స్ నుండి వచ్చిన మరో స్పై మూవీ ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్ నటించాడు, ఇప్పుడు ‘పఠాన్’ చిత్రానికి సీక్వెల్ నిర్మించాలని వైఆర్ఎఫ్ యోచిస్తోంది. ఈ క్రమంలో ‘పఠాన్’ చిత్రానికి సీక్వెల్ లో షారుఖ్ ఖాన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

‘వార్ 2’ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి తెరను పంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మేజర్ రఘు విక్రమ్ చలపతి పాత్రలలో అదరగొట్టాడు. ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు అదే పాత్ర ‘పఠాన్ 2’ సినిమాలో కూడా ఉంటుందని తెలుస్తోంది. YRF స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మధ్యన స్పై థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా నిర్మిస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్ . అంతేకాదు ఒక సినిమా కథను మరో మూవీకి లింక్ చేస్తోంది. అలా ‘పఠాన్’ సినిమాలో ‘టైగర్’ పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో వచ్చి వెళ్లిపోయాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పఠాన్ 2 లో ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్.

‘నఠాన్’ సినిమా 2023లో విడుదలైంది. షారుఖ్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి రంగం సిద్ధమైంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ఈ సినిమాలో నటిస్తాడా? లేదా? అన్నది క్లారిటీ రావడం లేదు. ‘వార్ 2’ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..