AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అక్షరాలా 1,758 కిలోమీటర్లు.. అల్లు అర్జున్ కోసం సైకిల్‌పై వచ్చిన అభిమాని.. బన్నీ ఏం చేశాడో తెలుసా?

పుష్ప, పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఒక వీరాభిమాని అల్లు అర్జున్ ను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా 1700 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కుతూ..

Allu Arjun: అక్షరాలా 1,758 కిలోమీటర్లు.. అల్లు అర్జున్ కోసం సైకిల్‌పై వచ్చిన అభిమాని.. బన్నీ ఏం చేశాడో తెలుసా?
Allu Arjun
Basha Shek
|

Updated on: Dec 16, 2025 | 9:45 PM

Share

పుష్ప 2 సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఇప్పుడు అతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక వీరాభిమాని అల్లు అర్జున్ ను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ చేరుకొని తన ఫేవరెట్ హీరోని కలిశాడు. ఆ వీరాభిమాని పేరెంటో కచ్చితంగా తెలియదు కానీ నార్త్ ఇండియాకు చెందిన ఆ వ్యక్తి అల్లు అర్జున్ ని కలవడం కోసం ఏకంగా 1,758 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ కూడా ఆ అభిమానిని ఆప్యాయంగా పలకరించాడు. ఫ్యామిలీ, క్షేమ సమాచారం గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు అతనితో ఫొటోలు, సెల్ఫీలు దిగాడు. చివరగా ఆ వీరాభిమానికి కొంత ఆర్థిక సాయం చేశాడు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు.. కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. కానీ కొందరు నెటిజన్లు మళ్లీ ఆ అభిమాని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. వీటిని చూసిన బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో హాలీవుడ్ లెవెల్ లో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి వారణాసి సినిమా ఈవెంట్ తరహాలో గ్రాండ్ ఈవెంట్ ద్వారా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ వేడుక మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉండబోతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.