Team India: థియేటర్‌కు వెళ్లి మరీ ఆ సినిమాను చూసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్
సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూసి ఆనందిస్తున్నారు. తాజాగా టీం ఇండియా ఆటగాళ్లందరూ కలిసి లక్నోలోని ఓ మల్టీప్లెక్స్ కు వెళ్లి మరీ ఈ సినిమాను వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ ఇప్పటికే రూ.400 కోట్లకు చేరువలో ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందంటే, టీం ఇండియా ఆటగాళ్లు కూడా ‘ధురంధర్’ సినిమా చూశారు. క్రికెటర్ల కోసం మొత్తం ఒక థియేటర్‌నే బుక్ చేయించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17న (బుధవారం) టీమిండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. దాని కోసం టీం ఇండియా ఆటగాళ్లు లక్నో చేరుకున్నారు. అయితే సోమవారం (డిసెంబర్ 15) రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్న ఆటగాళ్లు సినిమా చూడటానికి సమయం కేటాయించారు. లక్నోలోని ఒక మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి 8.10 గంటలకు టీం ఇండియా ఆటగాళ్ల కోసం షో బుక్ చేశారు. ఇక సినిమా ముగిసేసరికి అర్ధరాత్రి 12.10 అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ తదితర క్రికెటర్లు ధరంధర్ సినిమా చూసి ఆనందించారు.
కాగా భద్రతా దృష్ట్యా టీం ఇండియా ఆటగాళ్లు, సిబ్బందిని తప్ప మరెవరినీ ఈ స్క్రీనింగ్‌లోకి అనుమతించలేదు. ఆటగాళ్ల భద్రత మరియు సౌలభ్యం కోసం మొత్తం థియేటర్ బుక్ చేశారని మల్టీ ప్లెక్స్ నిర్వాహకులు తెలిపారు. టీం ఇండియా ఆటగాళ్లు ‘ధురంధర్’ చూసిన తర్వాత ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది.
లక్నో థియేటర్ లో టీమిండియా క్రికెటర్లు..
Movie night for Team India 👀 pic.twitter.com/vtvAbHJ3Fe
— Shubman X 77 (@AyushKumar76463) December 16, 2025
ఆదిత్య ధార్ ‘ధురంధర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాకిస్తాన్‌లో భారత గూఢచారులు నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వాస్తవ సంఘటనలకు కొన్ని కల్పిత అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా నిడివి 3 గంటల 32 నిమిషాలు అయినప్పటికీ ప్రజలు ఓపికగా చూస్తున్నారు. ఇందులో ఒకప్పటి ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








