Bigg Boss Telugu 9: పవన్ గెలుపు కోసం రంగంలోకి రీతు.. మాజీ కంటెస్టెంట్స్‌తో కలిసి ఏం చేసిందో తెలుసా? వీడియో
సుమారు మూడు నెలలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ఈ వారంలోనే ఎండ్ కార్డ్ పడనుంది. ఆదివారం (డిసెంబర్ 21) జరిగే గ్రాండ్ ఫినాలే కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ టైటిల్ కోసం మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఈ వారంలోనే ఎండ్ కార్డ్ పడనుంది.ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి జరిగే గ్రాండ్ ఫినాలే కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తనూజ, పవన్ కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజనా బిగ్ బాస్ టైటిల్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఆయా కంటెస్టెంట్ల అభిమానులతో పాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా తమకు ఇష్టమైన వారికి మద్దతునిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డిమాన్ పవన్ గెలుపు కోసం రీతూ చౌదరి రంగంలోకి దిగింది. మాజీ కంటెస్టెంట్స్ తో కలిసి వరుసగా వీడియోలు చేస్తోంది.
అలా తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో ముందుగా రీతూ చౌదరి ఇలా అడుగుతుంది.. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఫైనలిస్టులు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. ఆ ఫైవ్ మెంబర్స్ లో ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నావు అని రీతు మాజీ కంటెస్టెంట్ రాము రాథోడ్ ను అడిగింది. దీనికి స్పందించిన రాము రాథోడ్ ‘నేనైతే పవన్ అని అనుకుంటున్నాను. నాకైతే జెన్యూన్ గా నా మైండ్ కి స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయిన వ్యక్తి అతనే. అతనికి సరిగ్గా ఆడడానికి స్కోప్ దొరకలేదు. మనోడు ఆడితే ఎవరూ కూడా పక్కన నిలబడలేరు. ఆ తర్వాత మరో మాజీ కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘మనోడు గేమ్ కి అందరూ కూడా పడిపోయారు. నాకు కూడా పర్సనల్ గా మంచి ఫ్రెండ్. ఆడియన్స్ మీరందరూ కూడా ఒక కామనర్ ని గెలిపించాలి అని రిక్వెస్ట్ చేశాడు సాయి శ్రీనివాస్. రీతు చౌదరి మాట్లాడుతూ అతనికి అసలు పీ ఆర్ లేదు. అతను వితౌట్ ఫియర్ గేమ్ ఆడుతున్నాడు’ అంటూ ప్రశంసలు కురిపించింది. ఇక మరో మాజీ కంటెస్టెంట్ ఆశాషైనీ అలియాస్ ఫ్లోరా షైనీ కూడా డిమాన్ పవన్ కు మద్దతుగా నిలిచింది. ఆడియెన్స్ అందరూ పవన్ కు ఓటేసి గెలిపించాలని ఓ వీడియో రిలీజ్ చేసింది.
వీడియో ఇదిగో..
మొత్తానికి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యిన తర్వాత కూడా పవన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తోంది రీతూ చౌదరి. అతని గెలుపు కోసం వరుసగా వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. కాగా పవన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్కులు విషయంలో చాలా పర్ఫెక్ట్. ఇక అతని మాట తీరు కూడా చాలా జెన్యూన్ గా ఉంటుందని అభిమానులు చెబుతుంటారు. అయితే తనూజ, కల్యాణ్ లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కు లేకపోవడం మైనస్ గా మారింది. అందుకే ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లోనూ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఓటింగ్ కు ఇంకా చాల సమయం ఉంది. మరి రీతూ చౌదరి కోరుకున్నట్లుగానే డిమాన్ పవన్ బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








