- Telugu News Photo Gallery Cinema photos Dil Raju Performs Special Pooja With His Wife Tejaswini And Son, See Photos
Dil Raju: భార్య, కుమారుడితో కలిసి దిల్ రాజు ప్రత్యేక పూజలు.. ఫొటోస్ వైరల్.. ఎందుకంటే?
దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో చనిపోయారు. ఇది జరిగిన మూడేళ్లకు అంటే 2020లో తేజస్వినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. 2022లో ఈ దంపతులకు అన్వి రెడ్డి అనే కుమారుడు జన్మించాడు. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated on: Dec 16, 2025 | 10:16 PM

టాలీవుడ్ అగ్ర నిర్మాత అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఒక అన్వి రెడ్డి అనే బాబు ఉన్నాడు.

ప్రస్తుతం దిల్ రాజు సినిమా నిర్మాణంతో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కీలక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని అమితంగ ఆరాధించే దిల్ రాజు ఇంట్లో తాజాగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిల్ రాజుతో పాటు ఆయన భార్య, కుమారుడు ఈ పూజల్లో పాల్గొన్నారు.

దిల్ రాజు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది తేజస్విని.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో దిల్ రాజు కుమారుడు అన్వి రెడ్డి చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు

కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దిల్ రాజు ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ఇందులో హీరోగా నటించనున్నట్లు సమాచారం.




