AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్

పుష్ప 2 సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ హీరోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక పుష్ప 2 తర్వాత అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ ప్రిస్టీజియస్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్.

Allu Arjun: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్
Allu Arjun
Basha Shek
|

Updated on: Dec 17, 2025 | 9:44 PM

Share

చాలా మంది హీరోల్లాగే అల్లు అర్జున్ కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడమో, స్టోరీ సూట్ కాకపోవడమో, కథ నచ్చకపోవడమో.. ఇలా వివిధ కారణాలతో బన్నీ వదిలేసిన సినిమాలు చాలా నే ఉన్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వగా కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి అల్లు అర్జున్ జడ్జ్ మెంట్ కరెక్ట్ అని నిరూపించాయి. అలా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో ఒక క్రేజీ హీరో సూపర్ సక్సెస్ ని సాధించాడు. వివరాల్లోకి వెళితే.. విక్రమ్ కే కుమార్ కు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుంది. 13 బి, 24, మనం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు విక్రమ్ కే కుమార్. అలాగే యూత్ స్టార్ నితిన్ కు ‘ఇష్క్’ రూపంలో బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాకు హీరోగా నితిన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. విక్రమ్ కే కుమార్ అల్లు అర్జున్ తో ఈ సినిమా చేద్దామనకున్నాడట. బన్నీకి కథ కూడా చెప్పాడట. అయితే అప్పటికే అల్లు అర్జున్ చేతిలో పలు సినిమాలు ఉండడంతో ఇష్క్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో ఆ మూవీ ని నితిన్ తో చేసి సూపర్ సక్సెస్ కొట్టారు విక్రమ్ కే కేమార్.. ఈ సినిమాతోనే 13 ఫ్లాప్ సినిమాలకు చెక్ పెడుతూ సూపర్ సక్సెస్ అందుకున్నాడు హీరో నితిన్.

కేవలం ఇష్క్ ఒక్కటే కాదు వివిధ కారణాలతో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ మూవీస్ కూడా ఉన్నాయి. జయం, భద్ర, బొమ్మరిల్లు, 100 % లవ్, అర్జున్ రెడ్డి, పండగ చేస్కో, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా మొదట అల్లు అర్జున్ దగ్గరకే వచ్చాయట. అయితే వివిధ కారణాలతో బన్నీ వాటిని వద్దనుకున్నాడట.

ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో హాలీవుడ్ లెవెల్ లో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!
ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్
ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్
పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు
పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు
ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..
ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..
రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!
రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!
ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?
ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..
కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!
కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్
ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్