OTT Movie: ముక్కలు ముక్కలుగా బాడీ పార్ట్స్.. ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన క్రైమ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఒక నగరంలో జరిగే వరుస హత్యలు, వాటి ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ఆద్యంతం ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ సిరీస్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. అందుకే ఈ ఏడాది ఐఎమ్ డీబీ టాప్ రేటింగ్ సిరీసుల్లో ఒకటిగా ఇది నిలిచింది.

2025 సంవత్సరం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2026 రానుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. 2025 సంవత్సరంలో పలు సూపర్ హిట్ మూవీస్ రిలీజయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్ లు కూడా అద్భుతమైన ఒరిజినల్స్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది ఐఎమ్ డీబీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న క్రైమ్ సిరీస్ కూడా ఈ జాబితాలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నిజంగానే నెక్ట్స్ లెవెల్. ఎవరూ ఊహించని కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, అద్దిరిపోయే ట్విస్టులతో ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది ఈ సిరీస్. ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటే అన్నీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్‌లోని చరందాస్‌పూర్ అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది.. అడవికి దగ్గరలో ఉన్న ఒక మంత్రగత్తె రహస్యంగా క్షుద్రపూజలు చేస్తుంటుంది. ఎవరికైనా కోరికలు ఉంటే వారి బొటనవేలు సమర్పిస్తే కోరికలు తీరుతాయని అందరినీ నమ్మిస్తుంటుంది. మంత్రగత్తె మాటలు నమ్మిన చాలామంది గ్రామస్థులు అక్కడకు వెళ్లి బొటనవేలు సమర్పిస్తుంటారు. అదే సమయంలో కొందరు గ్రామస్తులు ఈ విషయం తెలుసుకుని కలిసికట్టుగా అడవి నుంచి ఆ మంత్రగత్తెను తరిమేస్తారు.
ఇది జరిగిన చాలా ఏళ్లకు చరణ్ దాస్ పూర్ లో వరుస హత్యలు కలకలం రేపుతాయి. ముక్కలు ముక్కలుగా చేసిన మృతదేహాలపై డిఫరెంట్ సింబల్స్ కూడా ఉంటాయి. మరి ఈ హత్యలకు కారణమెవ్వరు? గతంలో ఊరి నుంచి తరిమివేసిన మంత్ర గత్తెకు ఈ హత్యలకు ఏమన్నా సంబంధముందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘మండల మర్డర్స్’. హీరోయిన్ వాణి కపూర్‌తో పాటు సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా, శ్రియా పిల్గావ్‌కర్ తదితరులు ఇందులో నటించారు. ఈ సిరీస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లను ఇష్టపడేవారు దీనిపై ఓ లుక్కేసుకోవచ్చు
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
#MandalaMurders (2025-) 🇮🇳 In a quaint mysterious town of Charandaspur, where fate, myth & murder entwine, detectives Rea Thomas and Vikram Singh unravel a chilling conspiracy of ritualistic killings tied to a centuries-old secret society.#TVThemeTunes #TVIntros #TVX 📺 🎬 pic.twitter.com/ouO9BKGmdn
— QuirkyFilms (@FilmsQuirky) December 2, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .








