బాబోయ్ ఇదెక్కడి సినిమారా అయ్యా.! సీన్ సీన్‌కు డ్రాప్స్ పడాల్సిందే.. ఎక్కడ చూడొచ్చంటే
ఓటీటీలో హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో ఈ జానర్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంటుంది.

కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాలకు అయితే ఈ గ్యాప్ కూడా ఉండడం లేదు. ఇక ఓ మోస్తరు విజయం సాధించిన సినిమాలు 45 రోజులకు అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలయితే 2 నెలలు.. మొత్తానికి ఎలాంటి సినిమా అయినా 30, 45 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. అయితే ఈ సినిమా విషయంలో కాస్త డిఫరెంట్. మొన్నామధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఓ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించింది. బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. సీన్ సీన్ కు సుస్సూ పోయించిన ఈ సినిమా ఏకంగా ఈ సినిమా రూ. 2000 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది.
ఈ హారర్ సినిమాను సుమారు రూ.335 కోట్లతో తెరకెక్కించారు. ఈ మూవీ 23.5 కోట్ల డాలర్లు పైగా అంటే సుమారు రూ.2 వేల కోట్లు వసూలు చేసింది. అసలు ఈ మూవీ స్టోరీనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే క్లాస్ కు చెందిన ఒక్క స్టూడెంట్ తప్ప మిగిలిన వాళ్లందరూ ఒకే రాత్రి ఒకే సమయానికి మామయైపోతారు. ఎందుకు అలా జరిగిందో అక్కడి వాళ్లకు అర్ధం కాదు. అసలు విద్యార్థులు ఏమయ్యారు.? ఎక్కడికి వెళ్లారన్నది తెలుసుకోవడమే ఈ సినిమా కథ. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 7.8 రేటింగ్ ఉంది. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.
ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు వెపన్స్. జాక్ క్రెగర్ తెరకెక్కించి నీ హారర్ థ్రిల్లర్ మూవీలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ లాంటి టాప్ స్టార్స్ నటించారు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుండగానే వెపన్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




