- Telugu News Photo Gallery Cinema photos Do you know who Rukmini Vasanth's favorite Tollywood hero is, He is Natural Star Nani
అతనంటే నాకు పిచ్చి.. టాలీవుడ్ హీరో పై మనసు పారేసుకున్న రుక్మిణి వసంత్
ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. రక్షిత్ శెట్టి సరసన సప్త సాగరాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.
Updated on: Dec 15, 2025 | 3:52 PM

ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. రక్షిత్ శెట్టి సరసన సప్త సాగరాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఈ మూవీతో ఈ బెంగుళూరు బ్యూటీ పేరు మారుమోగింది.ఈ సినిమా తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ జోడిగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా ఆమెకు నిరాశే మిగిల్చింది. ఇప్పుడు ఈ బ్యూటీకి పాన్ ఇండియ లెవల్లో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె పేరు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది.

రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్.. తెలుగులో తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పేసింది. తెలుగులో మీకు ఏ హీరో అంటే ఇష్టం ? ఎవరితో నటించాలని ఉందని అడగ్గా.. తనకు న్యాచురల్ స్టార్ నాని అంటే ఫేవరేట్ అని తెలిపింది. ఆయనతో కలిసి సినిమా చేయాలనుకున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇటీవల వరుసగా కాంతార సినిమాలో తన లుక్స్ షేర్ చేస్తూ జనాలను కట్టిపడేసింది.