బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
అందాల ముద్దుగుమ్మ మీర్నా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ మధ్య ఈ చిన్నది నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే కటౌట్‌లో కనిపించి అందరినీ మాయ చేస్తోంది.
Updated on: Dec 15, 2025 | 11:02 PM

అందాల ముద్దుగుమ్మ మీర్నా మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన క్యూట్ క్యూట్ అందాలతో అందరినీ మాయ చేసింది ఈ బ్యూటీ. తాజాగా ఈ అందాల చిన్నది అదిరిపోయేస్టిల్స్‌లో అభిమానులను ఆకట్టుకుంటుంది.

తమిళ సినిమాతో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీర్నా మీనన్. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మంచి మంచి అవకాశాలు అందుకుంది.

ఈ ముద్దుగుమ్మ రజనీకాంత్ జైలర్ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ సరసన ఉగ్రం సినిమాలో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన ఏ సినిమాలు అంతగా హిట్ అవ్వకపోవడంతో, ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు అడపాదడపా సినిమాల్లో ఛాన్స్ రావడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా, బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో తన అంద చందాలతో కుర్రకారును మాయ చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



