- Telugu News Photo Gallery Cinema photos Do you know who this serial actress who has become a sensation on social media is, She is Sharmitha Gowda
సీరియల్‌లో చీరకట్టు అలా.. నెట్టింట మోడ్రన్ డ్రస్సుల్లో ఇలా.. ఎవరో కనిపెట్టరా..?
బుల్లితెరపై తల్లి, అత్త పాత్రలతో పాపులర్ అయ్యింది. కన్నడలో ఎక్కువగా పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. కానీ తెలుగులో మాత్రం పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టేస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ… తన నటనతో జనాలను ఆశ్చర్యపరుస్తుంది.
Updated on: Dec 15, 2025 | 3:46 PM

బుల్లితెరపై తల్లి, అత్త పాత్రలతో పాపులర్ అయ్యింది. కన్నడలో ఎక్కువగా పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. కానీ తెలుగులో మాత్రం పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టేస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తూ… తన నటనతో జనాలను ఆశ్చర్యపరుస్తుంది.

కానీ సీరియల్ హీరోయిన్లకు మించిన అందం, గ్లామర్ లుక్స్ లో కనిపిస్తూ అడియన్స్ ను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు స్మాల్ స్క్రీన్ పై గ్లామర్ బ్యూటీ. విలన్ పాత్రలో కనిపించినప్పటికీ.. అందం, అభినయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. ఆమె మరెవరో కాదు.. రుద్రాణి అత్త.. అలియాస్ షర్మిత గౌడ. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

ప్రస్తుతం టీవీలో దూసుకుపోతున్న బ్రహ్మాముడి సీరియల్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది. ఇందులో రుద్రాణి అత్త పాత్రలో నటిస్తుంది. అంతకుముందు కన్నడలో గీత సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. ఇందులో హీరో తల్లి పాత్రలో నటిస్తుంది.

సీరియల్లో తల్లి, అత్త పాత్రలలో కనిపిస్తున్న షర్మిత గౌడ వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ఆమె 1990 నవంబర్ 20న జన్మించింది. గ్రాడ్యుయేషన్ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఎక్కువగా సీరియల్స్ చేసింది. కన్నడలో అనేక సీరియల్స్ చేసిన షర్మిత గౌడ.. ఇప్పుడు తెలుగులో బ్రహ్మాముడి సీరియల్ చేస్తుంది.

మరోవైపు కన్నడలో పలు రియాల్టీ షోలలో పాల్గొంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. షర్మితకు ఒక బాబు ఉన్నాడు. అతడు వయసు 13 సంవత్సరాలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. ఎక్కువగా మోడ్రన్ , గ్లామర్ లుక్ ఫోటోస్ షేర్ చేస్తుంది.




