ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్ గారు’.. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయన తార, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలు మెరిశారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ. 400 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘మన శంకరవప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా ఈ మూవీకి ఇప్పటికీ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. చిరంజీవి మార్క్ కామెడీ, డ్యాన్స్ లు, ఫైట్స్ కు తోడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాకు భారీ వసూళ్లు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే ఈ సినిమాకు రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తద్వారా రీజినల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘మన శంకరవప్రసాద్ గారు’ రికార్డుల కెక్కింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెగా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11 నుంచి ఈ మెగా మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది రూమర్ అయినప్పటికీ మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ పక్కా అని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని టాక్.
#ManaShankaraVaraPrasadGaru Worldwide Gross ₹403 Crores 🔥🔥🔥
All Time Industry Record 🔥🔥🔥First ever ₹400 Cr gross for a regional film in Tollywood 🔥🔥 Megastar @KChiruTweets 👑 pic.twitter.com/rTmr0wiOov
— Asian Box Office (@AsianBoxOffice) January 31, 2026
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించి ఈ సినిమాలోలేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూర్చారు.
🔥 #ManaShankaraVaraPrasadGaru Day18 Box Office
🇮🇳 Day18 India Gross: ₹2.85Cr 🌏 Till Day Worldwide Gross: ₹288Cr#MSG #BoxOffice #WorldwideGross #Tollywood #TeluguCinema #CinemaUpdates pic.twitter.com/ZnqlPwvnuC
— @CinemaAtlas (@Localcineupdate) February 2, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




