OTT Movie: అట్టపెట్టెలో కాలిపోయిన శవాలు.. ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.6/10 రేటింగ్
కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ 8.6/10 రేటింగ్ ఉండడం విశేషం.

సాధారణంగా ఓటీటీలో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లో వస్తుంటాయి. అప్పుడప్పుడు వారం మధ్యలోనూ కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రావొచ్చు. అలా ఈ గురువారం (డిసెంబర్ 04) కూడా ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడెన్ గా డిజిటల్ స్ట్రీమింగ్ లో ప్రత్యేక్షమైంది. ఇదొక తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం సస్పెన్స్, గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. దీంతో ఈ ఏడాది జూన్‌లో తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. కాలిపోయిన శవాల కాళ్లు, చేతులు, మొండెం, తల వేర్వేరు అట్టపెట్టెల్లో పెట్టి హంతకుడు పలు ప్రదేశాల్ లోపడేస్తుంటాడు. వాటితో పాటు, మాస్క్‌ను కూడా హంతకుడు పంపిస్తూ ఉంటాడు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు.
ఈ కేసు ఛేదించడంలో భాగంగా పోలీసులు శివ (వైభవ్) సహాయాన్ని తీసుకుంటారు. ఊహించి బొమ్మలు గీయడంలో శివ బాగా నిష్ణాతుడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాలకు సంబంధించిన అసలైన ముఖాలు ఎలా ఉంటాయని ఊహించి వాటిని గీసి పోలీసులకు సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో సీరియల్ కిల్లింగ్స్ కేసుకు సంబంధించిన కేసు కూడా శివ వద్దకు వస్తుంది. మరి శివ ఈ కేసును ఎలా పరిష్కరించాడు? ఈ వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? శివ గతం ఏమిటి? హత్యల వెనకున్న ప్రధానమైన కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమాపేరు ‘ది హంటర్: చాప్టర్-1’ (The Hunter Chapter 1). వైభవ్, నందితా శ్వేత, తాన్యాహోప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్..
Twisted, Tense & Shocking
Who will be the first to find out the truth? Everything is going to change with one truth… #TheHunter Chapter 1 Set For Premiere on AHA Tomorrow#TheHunterChapter1 #VaibhavReddy @Nanditasweta @TanyaHope_offl #SaraswathiMenon @BhavaniHdmovies… pic.twitter.com/dyo6VrfISM
— Sai Satish (@PROSaiSatish) December 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








