AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంచ్‌కి పంచ్.. సవాల్‌కి ప్రతిసవాల్..! ఉప్పెనై విరుచుకుపడ్డ నారీ శక్తి !

రాజకీయాల్లో ఉన్నా.. ఉమెన్ పొలిటీషియన్స్ అంటే కాస్త సాఫ్ట్‌గానే ఉంటారు, అలాగే కనిపిస్తారు. ఒకరిద్దరు ఫైర్ బ్రాండ్స్ తప్పితే. కానీ, పార్టీల్లో శివంగుల్లాంటి మహిళా నేతలు ఇంత మంది ఉన్నారా అని మొదటిసారి తెలిసింది గుంటూరు ఎపిసోడ్‌తో..! పార్టీ ఆదేశాలతో పనిలే.. మీరెళ్లి మాట్లాడండి అని ఎవరూ ఆర్డర్స్ ఇవ్వలే.. వచ్చేశారంతే మీడియా ముందుకు. గోరంట్లలో ఫ్లెక్సీ రగడ నుంచి మొదలుపెడితే.. పరామర్శల దాకా స్టోరీ ట్విస్టులతో నడిచింది. అలా మలుపు తిరిగిన ప్రతిసారీ.. ఉమెన్ పొలిటీషియన్సే నోటికి పని చెప్పారు. మల్టీ స్టార్ సినిమాలో సోలో పర్ఫామెన్స్ చూపించారు.

పంచ్‌కి పంచ్.. సవాల్‌కి ప్రతిసవాల్..! ఉప్పెనై విరుచుకుపడ్డ నారీ శక్తి !
Ap Woman Politicians Dialogue War
Balaraju Goud
|

Updated on: Feb 06, 2026 | 10:05 PM

Share

ఏమాటకామాట.. ఏపీలోని ఉమెన్ పొలిటీషియన్స్‌లో ఈ రేంజ్ ఫైర్ ఎవరూ ఊహించలేదు. నాట్ ఓన్లీ పొలిటీషియన్స్. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆ స్థాయి రియాక్షన్ వస్తుందని గెస్ చేయలేదెవరు.. ఏంటా పంచ్ డైలాగ్స్ అసలు..! ఒక్కో మాట ఒక్కో బుల్లెట్‌లా పేలింది. బాంబింగ్ లాంటి డైలాగ్ పడుతుంటే.. పార్టీల కార్యకర్తలే గానీ, అభిమానులే గానీ తల తిప్పుకోలేకపోయారు. గల్లా మాధవి ఖబడ్దార్ వార్నింగ్స్ విన్నాక.. మనకో ఫైర్ బ్రాండ్ దొరికేసినట్టేనని అనుకుంది తెలుగు దేశం పార్టీ. అంబటి మౌనిక వాక్చాతుర్యం చూశాక.. మరో రాజకీయ వారసురాలు తయారైనట్టేనని గ్రేట్‌గా ఫీలైంది వైసీపీ. ఇక సోషల్ మీడియాలోనైతే.. వీళ్లకి ఇస్తున్న హైప్ ఓ లెవెల్ అంతే! మంత్రి గుమ్మడి సంధ్యా రాణి సవాల్ చేస్తే.. ఇటు మాజీ మంత్రి రోజా ప్రతి సవాల్ చేశారు. మంత్రి అనిత కౌంటర్ వేస్తే.. అటు మాజీ మంత్రి విడదల రజినీ కౌంటర్‌కే కౌంటర్ ఇచ్చారు. ఇటు కడప మాధవి ఫోర్స్‌ఫుల్ డైలాగ్‌కి.. అటు వరుదు కల్యాణి అదే ఫైర్‌తో సమాధానం ఇచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ నారీశక్తులే. ఛాన్స్ రావాలే గానీ.. సిచ్యుయేషన్‌కి తగ్గట్టుగా తుక్కు రేగ్గొడతామని నిరూపించారు. పార్టీ జోలికి వస్తే.. తమ తడాఖా ఇలాగే ఉంటుందని మాటలు-చేతల్లో చూపారు. ఇంకోసారి ఇంట్లో వాళ్ల జోలికొస్తే ఖలేజా చూపిస్తామన్నారు మరోపక్షం వాళ్లు. అసలు ఒకటా రెండా.. ఆ పంచ్‌ల వరద. ఈ టోటల్ ఎపిసోడ్‌లో ఎవరెలా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి