AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు.. అప్లై చేయండి ఇలా

Union Bank of India recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 1865 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగన అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Bank Jobs Alert: యూనియన్ బ్యాంక్‌లో 1865 ఖాళీలు..  అప్లై చేయండి ఇలా
Union Bank Of India Recruitment 2026 Apply Online For 1865 Posts, Step By Step Guide
Rajashekher G
|

Updated on: May 04, 2026 | 6:42 PM

Share

Union Bank of India Recruitment 2026: నిరుద్యోగ యువతకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) శుభవార్త తెలిపింది. మొత్తం 1865 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అప్రెంటిస్ శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉండగా, ఈ సమయంలో ప్రతి నెలా స్టైపెండ్ అందుతుంది. ఒక సంవత్సరం అనుభవంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

అర్హతలు, ఎంపిక విధానం

డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే బ్యాంకుల్లో అప్రెంటిస్ పూర్తి చేసిన వారు అర్హులు కారు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది.

స్థానిక భాష అవసరం

అభ్యర్థులు దరఖాస్తు చేసే రాష్ట్రంలోని అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి. అయితే ఆ భాషను 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో చదివిన వారికి మినహాయింపు ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు తెలుగు భాషపై పట్టు తప్పనిసరి.

స్టైపెండ్ వివరాలు

  • మెట్రో నగరాలు: ₹20,000/నెల
  • అర్బన్ ప్రాంతాలు: ₹18,000/నెల
  • రూరల్ బ్రాంచీలు: ₹15,000/నెల

అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NSDC) సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.

పరీక్ష విధానం

పరీక్ష మొత్తం 100 మార్కులకు, 60 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలు వస్తాయి:

  • ఫైనాన్షియల్ అవేర్‌నెస్ / జనరల్ నాలెడ్జ్
  • క్వాంటిటేటివ్ & రీజనింగ్
  • జనరల్ ఇంగ్లిష్
  • కంప్యూటర్ / సబ్జెక్టు నాలెడ్జ్
  • యూనియన్ బ్యాంక్ ఉత్పత్తులు, సేవలు
  • ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, నెగటివ్ మార్కింగ్ లేదు.

ముఖ్య తేదీలు, వివరాలు

  • మొత్తం ఖాళీలు: 1865
  • తెలంగాణ: 164
  • ఆంధ్రప్రదేశ్: 303
  • దరఖాస్తు చివరి తేదీ: మే 19
  • పరీక్షలు: మే / జూన్‌లో జరిగే అవకాశం
  • వయస్సు: 20–28 సంవత్సరాలు (రిజర్వేషన్ ప్రకారం సడలింపులు వర్తిస్తాయి)
  • అర్హత: 01 ఏప్రిల్ 2022 తర్వాత డిగ్రీ పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ / OBC: రూ. 600 + GST
  • SC / ST / దివ్యాంగులు / ట్రాన్స్‌జెండర్లు: రూ. 200 ఇంటిమేషన్ ఛార్జీ మాత్రమే.

ఎంపిక ప్రక్రియ:

ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించిన తరువాత అప్రెంటిస్‌గా నియమిస్తారు.

దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.unionbankofindia.bank.in/en/hom ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Follow Us