అతి పెద్ద పండు అయిన పనస పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Samatha

21 september 2026

Pic credit - Pinterest

పనసపండు చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది. అంతే కాకుండా దీనిని తినడం వలన కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

పనస పండు

కాగా, ఇప్పుడు మనం పనసపండు తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? దీనిని తినడం వలన కలిగే లాభాలు ఏవో చూసేద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

పనసపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇమ్యూనిటీ

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా పనసపండు చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.

జీర్ణక్రియ ఆరోగ్యం

అంతే కాకుండా పనసపండులో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. అందువలన ఇది బీపీ, అధిక రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది.

గుండెకు మేలు

అలాగే పనసపండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాల బెసట్ అని చెప్పాలి.

బరువు నియంత్రణ

అంతే కాకుండా పనసపండులో మెగ్నీషియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉండటం వలన దీనిని తినడం వలన రక్తహీనత తగ్గుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి.

రక్తహీనత

అదే విధంగా, అల్సర్, ఆస్తమా వంటి సమస్యలతో ఎవరు  అయితే బాధ పడుతున్నారో వారు ఈ పండును తినడం వలన దాని నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చునంట.

అల్సర్, ఆస్తమా