- Telugu News Photo Gallery Cinema photos Mangalavaaram sequel will soon go on the sets with a top heroine in the lead role
Mangalavaaram 2: మంగళవారం సీక్వెల్ రంగం సిద్ధం.. ఓ అగ్ర హీరోయిన్ ప్రధాన పాత్రలో..
కొన్ని సినిమాలు తెలియకుండానే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. ఆడియన్స్‌లో ఆసక్తి రేపుతుంటాయి. అలాంటి ఓ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. రెండేళ్ళ కింద విడుదలైన మంగళవారం సినిమా వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే హిట్ కొట్టింది. దాని సీక్వెల్ కథేంటి..? ఎంత వరకు వచ్చింది.?
Updated on: Apr 26, 2025 | 2:40 PM

కార్తికేయ, పాయల్ రాజపుట్ హీరోహీరోయిన్లుగా ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు అజయ్ భూపతి. అయితే ఆర్ఎక్స్ 100 తర్వాత అదే టెంపో కంటిన్యూ చేయలేకపోయారీయన.

మంచి అంచనాలతో వచ్చిన మహా సముద్రం దారుణంగా ఫ్లాప్ అయింది. శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరి, అను అదిరిపోయే క్యాస్టింగ్ ఉన్నా.. అస్సలు కథ లేకపోవడంతో మునిగిపోయింది మహా సముద్రం.

మహా సముద్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అజయ్ భూపతి చేసిన సినిమా మంగళవారం. పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో వచ్చిన ఈ చిత్రం అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయం సాధించింది.

2023లో వచ్చిన ఈ సినిమాకు అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ బలం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు అజయ్. ఏడాదిగా ఈ స్క్రిప్ట్‌పైనే బిజీగా ఉన్నారీయన. మంగళవారం హిట్టైనా.. A సర్టిఫికేట్ సినిమా. అందుకే పార్ట్ 2తో పూర్తిగా ఫ్యామిలీస్‌ను టార్గెట్ చేస్తున్నారు అజయ్ భూపతి.

ఓ అగ్ర హీరోయిన్ నటించబోతున్న మంగళవారం 2ను పెద్ద ప్రొడక్షన్ హౌజ్ నిర్మించబోతుంది. పూర్తి డివోషనల్ టచ్‌తో ఈ సినిమా రానుంది. మరి మంగళవారం 2తో అజయ్ మరో హిట్ కొడతారా లేదా అనేది చూడాలి.




