- Telugu News Photo Gallery Cinema photos Is this the reason why remake directors have less chance in Tollywood?
Remake Directors: రీమేక్ దర్శకులకు టాలీవుడ్లో ఛాన్సెస్ నిల్.. కారణం ఇదేనా.?
రీమేక్ చేస్తే ఆ దర్శకులకు పెద్దగా విలువ ఉండట్లేదా..? ఒక భాషలో హిట్టైన సినిమాలు మరో భాషలో తీస్తే అది దర్శకత్వం కింద హీరోలు పరిగణించట్లేదా..? రీమేక్ సినిమాలు చేసి హిట్టు కొట్టిన దర్శకులు కూడా ఎందుకు ఖాళీగా ఉన్నారు.. కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీమేక్ స్పెషలిస్టులకు అవకాశాలు పెద్దగా రావట్లేదు. అసలు దీనికి కారణం ఏంటి..?
Updated on: Apr 26, 2025 | 2:30 PM

తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ దర్శకులకు కాలం పెద్దగా కలిసి రావట్లేదు. కావాలంటే వీవీ వినాయక్‌నే తీసుకోండి.. స్ట్రైట్ సినిమాలు చేసినన్ని రోజులు ఈయన కెరీర్‌కు తిరుగులేదు. కానీ ఎప్పుడైతే రీమేక్ సినిమాల వైపు వెళ్లారో.. అప్పటి నుంచి వినాయక్ వైపు హీరోలు పెద్దగా చూడట్లేదు. రెండేళ్ళ కింద బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన చత్రపతి హిందీ రీమేక్ అయితే రెండ్రోజులు కూడా ఆడలేదు.

పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, కాటమరాయుడు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు డాలి కొన్నేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. వీటిలో గోపాల గోపాల సినిమాకు కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన యావరేజ్ అయింది. కాటమరాయుడు అయితే డిసాస్టర్ అయింది.

అలాగే మూడేళ్ల కింద వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ సైతం చాలా రోజుల ఎదురు చూపుల తర్వాత గానీ నితిన్‌తో తమ్ముడు సినిమా అవకాశం అందుకోలేదు. దీని షూటింగ్ పూర్తై చాలా రోజులవుతున్నా.. ఇప్పటి వరకు కనీసం ఒక్క టీజర్ కూడా రాలేదు.

గాడ్ ఫాదర్ సినిమాతో మెప్పించిన మోహన్ రాజాకు కూడా తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఈ సినిమాకు టాక్ బానే వచ్చినా కలెక్షన్స్ రాలేదు. దీంతో ఈ దర్శకుడికి కూడా ఎదురు చూపులు తప్పడం లేదనే చెప్పాలి.

ఇక అసురన్‌ను తెలుగులో నారప్పగా రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకి పెద్ద హీరోల నుంచి పిలుపు కరువైంది. ఆ మధ్య విరాట్ కర్ణ అనే కొత్త హీరోతో పెదకాపు సినిమా చేసినా ఫలితం శూన్యమే. వీళ్లే కాదు మరికొందరు రీమేక్ దర్శకులు అవకాశాల వేటలో వెనుకబడ్డారు.




