Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు పండగే.. రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. పలు సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఆర్ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు చెర్రీ. ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఏర్పడ్డారు. కాగా సినిమా రంగంలో రామ్ చరణ్ అందించిన సేవలకు ప్రతీకగా ఇప్పుడు అతనికి అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతిష్ఠాత్మక లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. మే9న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత విగ్రహాన్ని శాశ్వతంగా సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించనున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ విగ్రహాలను మాత్రమే మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరుతుండడంతో మెగాభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా రామ్ చరణ్ తో పాటు అతని పెట్ డాగ్ రైమ్ లకు సంబంధించిన కొలతలు, ఫొటోలు, వీడియోలను తీసుకుని ఈ మైనపు బొమ్మను అందంగా తీర్చి దిద్దారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ మిగిల్చిన నష్టాన్ని పెద్ది సినిమాతో భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. ఇటీవల పెద్ది నుంచి రిలీజైన టీజర్ మెగాభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చింది. సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ మెగా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠీ, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న పెద్ది మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీడియో ఇదిగో..
Ram Charan’s wax statue is coming to Madame Tussauds London! 🇬🇧🕺️ Holding his pet dog Rhyme 🐶, a testament to his global recognition 🌟, joining other Telugu stars like Prabhas, Mahesh Babu, and Allu Arjun! 😎#RamCharan pic.twitter.com/0048f7iA7E
— Nikhil (@Nikhilchou94216) April 26, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .