AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rithu Chowdary : ‘బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను.. కానీ నేను సంపాదించింది ఇంతే’: రీతూ చౌదరి

జబర్దస్త్ తో సహా పలు టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి. అలాగే యూట్యూబ్ వీడియోలతోనూ నెట్టింట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో రీతూ చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.

Rithu Chowdary : 'బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను.. కానీ నేను సంపాదించింది ఇంతే': రీతూ చౌదరి
Rithu Chowdary
Basha Shek
|

Updated on: Apr 28, 2025 | 6:24 PM

Share

కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినీ ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై వరుసగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రమేయమున్న వారందరికీ హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొందరు విచారణకు కూడా హాజరై తామెలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశామో వివరణ కూడా ఇచ్చుకున్నారు. మరికొందరు సెలబ్రిటీలైతే సోషల్ మీడియా ద్వారా తమ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించింది రీతూ చౌదరి. ‘నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు అని చెప్పను. కానీ చేసింది ఎన్ని అనేది కూడా చూడాలిగా. నేను చాలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్టు ఇష్టమొచ్చినట్టు రాయద్దు కదా. దాని గురించి తెలియనప్పుడు నేను చేశాను. తెలిశాక అసలు వాటి జోలికి వెళ్లలేదు. తప్పు అని తెలియనప్పుడు చేసాను’

‘అన్ని చోట్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇంక తప్పు అని నాకెలా తెలుస్తుంది. అక్కడకు కూడా నేను ఒక రెండిటికి మాత్రమే ప్రమోట్ చేశాను. తెలిసాక నేను చేసింది తప్పు అని వీడియో కూడా పెట్టాను. మళ్లీ ఎవరూ చేయొద్దు అని చెప్పాను. బెట్టింగ్ యాప్స్ లో లక్షలు, కోట్లు ఏమీ ఇవ్వరు. మధ్యలో చాలా మంది మీడియేటర్లు ఉంటారు. ఆ ప్రమోషన్ నా దగ్గరకు వచ్చేసరికి ఒక్కో వీడియోకు 50 వేలు, 60 వేలకు మించి రాదు’ అని చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గ్లామరస్ లుక్ లో జబర్దస్త్ రీతూ చౌదరి..

ఒక ఏడాది క్రితం రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే అబ్బాయిని సామాజిక మాధ్యమాల వేదికగా పరిచయం చేసింది. శ్రీకాంత్ తో క్లోజ్ గా ఉన్న అనేక ఫోటోలు కూడా షేర్ చేసింది. శ్రీకాంత్ హైదరాబాద్ కి చెందిన ఓ పొలిటీషియన్, బిజినెస్ మెన్. గతంలో వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు అని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన రీతూ.. ‘నాకు పెళ్లి అవ్వలేదు. ఆ పెళ్లి ఫోటోల గురించి నేను మాట్లాడను, అది నా పర్సనల్. అది అసలు పెళ్లి లాంటిదే కాదు’ అని క్లారిటీ ఇచ్చింది.

ట్రెడిషినల్ శారీ లో జబర్దస్త్ బ్యూటీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..