Actress Urvashi: సినిమాల్లోకి నటి ఊర్వశి కూతురు.. అందంలో అమ్మను మించిపోయిందిగా.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టింది ఊర్వశి. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజి బిజీగా ఉంటోంది. అయితే త్వరలోనే ఊర్వశి కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఛైల్డ్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో వందలాది సినిమాల్లో నటించింది ఊర్వశి. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. ఇప్పటివరకు అన్నీ భాషల్లో కలిసి సుమారు 700 కు పైగా సినిమాల్లో నటించిందీ అందాల తార. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. రుస్తుం, అంతిమ తీర్పు, చెట్టుకింద ప్లీడర్, పాడుతా తీయగా, విజయ రామరాజు, సందడే సందడి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తోందీ అందాల తార. కాగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన ఊర్వశి పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కొంది. సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె 2000లో నటుడు మనోజ్ జయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు తేజ లక్ష్మి అనే కూతురు పుట్టింది. అయతే ఆ తర్వాత మనోజ్‌తో విభేదాలు రావడంతో అతని నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం 2013లో శివ ప్రసాద్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇషాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతనితోనే కలిసి జీవిస్తోంది ఊర్వశి. కానీ కూతురు తేజలక్ష్మి మాత్రం తన తండ్రి మనోజ్‌తో నే కలిసి ఉంటోంది.
ఇప్పుడు తల్లి దండ్రుల బాటల్లోనే అడుగు లేస్తోన్న తేజలక్ష్మి త్వరలోనే సినిమాల్లోకి అడుగు పెట్టనుంది. ఈ విషయాన్ని ఆమె తల్లినే స్వయంగా వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఊర్వశి.. ‘ఈ సినిమాల వల్ల నేను చదువు మధ్యలో మానేయాల్సి వచ్చింది. నా కూతురికి అలాంటి పరిస్థితి రాకూడదని దేవుడిని మనసారా కోరుకున్నాను. ముందు తన చదువు పూర్తి చేయమన్నాను. ఆ తర్వాతే సినిమాలపై ఆసక్తి ఉంటే ఈ ఇండస్ట్రీలోకి రావాలన్నాను. తన కాళ్లపై తను నిలబడిన తర్వాతే సినిమాల గురించి ఆలోచించమని చెప్పాను. ఈ మధ్యే నా కూతురి ఉన్నత చదువులు పూర్తయ్యాయి. ఇప్పుడు తనకు నచ్చినట్లు చేసుకోనీ. మంచి సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు తనే స్వయంగా కథ విని, చేయాలా? వద్దా? అని నిర్ణయించుకునే తెలివి తేటలు వచ్చాయి’ అని చెప్పుకొచ్చింది ఊర్వశి.
కూతురితో నటి ఊర్వశి..
View this post on Instagram
ఊర్వశి కూతురు తేజ లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం గ్లామరస్ ఫోటోస్ అండ్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది.
తండ్రితో తేజ లక్ష్మి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








