Allu Aravind: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్, బన్నీవాసు.. డాక్టర్లు ఏం చెప్పారంటే? వీడియో
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న ఈ బాలుడిని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు పరామర్శించారు.

పుష్ప 2 ప్రిమియర్ సందర్భంగా.. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనిని సికింద్రా బాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గత మూడు నెలలుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు శ్రీ తేజ్. ఇటీవల అతని ఆరోగ్యం కాస్త మెరుగు పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ వెంటనే బాలుడిని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు శ్రీ తేజ్ ను పరామర్శించారు. సోమవారం (మే05) రిహాబిలిటేషన్ సెంటర్ కు వచ్చిన వారు బాలుడి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని ఆరోగ్య పరిస్థితిని తరచూ అడిగి తెలుసకుంటున్నారు. అలాగే శ్రీ తేజ్ కు చికిత్సకు అయ్యే ఖర్చులన్నింటినీ వీరే భరిస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రీ తేజ్ ఫ్యామిలీకి భారీ ఆర్థిక సాయం అందజేశారు కూడా. ఇక శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్‌లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ భరోసా ఇచ్చారు.
శ్రీ తేజ్ తో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు.. వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.