AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ఇక బుల్లితెరపై రప్పా రప్పా.. టీవీలో అల్లు అర్జున్ పుష్ప 2.. ఎప్పుడు, ఎక్కడ టెలికాస్ట్ కానుందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2' సినిమా థియేటర్లలో పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

Pushpa 2: ఇక బుల్లితెరపై రప్పా రప్పా.. టీవీలో అల్లు అర్జున్ పుష్ప 2.. ఎప్పుడు, ఎక్కడ టెలికాస్ట్ కానుందంటే?
Pushpa 2 Movie
Basha Shek
|

Updated on: Apr 06, 2025 | 2:49 PM

Share

అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ విడుదలై అక్కడ కూడా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా టీవీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘పుష్ప 2’ ఏప్రిల్ 13న సినిమా టీవీలో టెలికాస్ట్ కానుంది. టీవీలో టెలికాస్ట్ కావడం ఇదే తొలిసారి కాబట్టి పుష్ప 2 మూవీ రికార్డు టీఆర్పీలను సాధిస్తుందని భావిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘పుష్ప 2’ గత డిసెంబర్‌లో ఒకేసారి వివిధ భాషల్లో రిలీజైంది. ఇప్పుడు టీవీ లో కూడా ఒకే రోజున వివిధ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఏప్రిల్ 13న, ‘పుష్ప 2’ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం తదితర భాషల్లో వివిధ ఛానెళ్లలో ప్రసారం కానుంది. ‘పుష్ప 2’ సినిమా ఓటీటీలో విడుదలైనప్పుడు ప్రత్యేకంగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఇప్పుడు అదేవిధంగా, ‘పుష్ప 2’ టీవీ ప్రీమియర్ కోసం తెలుగులో ప్రత్యేక ప్రకటనలు నిర్మించి ప్రసారం చేస్తున్నారు.

‘పుష్ప 2’ తెలుగులో స్టార్ మాలో ప్రసారం కానుంది. ఏప్రిల్ 13 (ఆదివారం)న సాయంత్రం 5 గంటలకు ఈ మూవీని టెలికాస్ట్ చేయనున్నట్లు ఇప్పటికే స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తోంది. ‘పుష్ప 2’ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.

ఇవి కూడా చదవండి

వచ్చే ఆదివారమే  స్టార్ మా లో పుష్ప 2..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు