AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sago: సగ్గుబియ్యం వేటి నుంచి ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు పక్కా ఆశ్చర్యపోతారు..

వివిధ వంటలలో వినియోగించే సగ్గుబియ్యాన్ని కర్రపెండలం దుంపల నుంచి ఫ్యాక్టరీలలో తయారుచేస్తారు. ఇది క్లిష్టమైన క్లినింగ్, క్రషింగ్, జల్లెడ పట్టడం, రోస్టింగ్, డ్రైయింగ్ ప్రక్రియలను కలిగి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న సగ్గుబియ్యం ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతారు. ..

Sago: సగ్గుబియ్యం వేటి నుంచి ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు పక్కా ఆశ్చర్యపోతారు..
Sago
Ram Naramaneni
|

Updated on: Mar 18, 2026 | 6:10 PM

Share

సగ్గుబియ్యం, తెలుగు వంటకాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ఆహార పదార్థం.  అనేక రుచికరమైన వంటకాలలో వీటిని ఉపయోగిస్తారు. అయితే, ఈ సగ్గుబియ్యాన్ని పండించరు, ఇది కర్రపెండలం దుంపల నుంచి ఫ్యాక్టరీలలో ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ద్వారా తయారవుతుంది. ఈ తయారీ వెనుక ఉన్న పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గుబియ్యం తయారీకి కావాల్సింది కర్రపెండలం దుంపలు. మొదట, రైతుల నుంచి తాజా కర్రపెండలం దుంపలను సేకరించి ఫ్యాక్టరీలకు తీసుకువస్తారు. కన్వేయర్ బెల్ట్‌ల సహాయంతో, దుంపలు మెకానికల్ స్క్రబ్బర్ల వద్దకు చేరతాయి. ఈ యంత్రాలు దుంపలకు అంటుకున్న మట్టిని సమర్థవంతంగా తొలగిస్తాయి. తదుపరి దశలో, దుంపలు మెకానికల్ పీలర్ల వద్దకు వెళ్లి వాటి తొక్కను వలిచి వేస్తాయి. అనంతరం, దుంపలను శుభ్రమైన నీటితో మరింత శుభ్రం చేసి, ఏదైనా మిగిలిన మట్టి లేదా మలినాలను తొలగిస్తారు.

శుభ్రం చేసిన దుంపలను మెత్తగా క్రష్ చేస్తారు. ఈ క్రషింగ్ ప్రక్రియ ద్వారా కర్రపెండలం పల్ప్ ఉత్పత్తి అవుతుంది.  ఈ పల్ప్‌ నుంచి స్టార్చ్‌ను వేరుచేయడం తదుపరి కీలకమైన దశ. పల్ప్‌ను దాదాపు 10 జల్లెడల ద్వారా నంబర్స్ వైజ్ ఫిల్టర్ చేస్తారు. ఈ ఫిల్టరింగ్ ద్వారా పల్ప్‌లోని పీచు పదార్థం (ఫైబర్) ఒకచోటకి చేరుతుంది. ఈ పీచును ప్రెస్ చేసి అందులోని నీటిని తీసివేసి, పీచును కన్వేయర్ ద్వారా పక్కకు పంపేస్తారు. ఫిల్టర్ చేయబడిన పల్ప్ నుంచి వచ్చిన “మిల్క్” (స్టార్చ్, నీటి మిశ్రమం) ప్రత్యేక ఛానెల్స్‌ లేదా టేబుల్స్‌ మీదకు వస్తుంది. ఇక్కడ స్టార్చ్ బరువుగా ఉండటం వల్ల కిందకు సెటిల్ అవుతుంది. మిగిలిన స్టార్చ్‌ను ట్యాంకులలో సెటిల్ చేసి, నీటిని బయటికి పంపేస్తారు. సెటిల్ అయిన స్టార్చ్‌లోని మలినాలను తొలగించడానికి, దానిని మళ్లీ నీటితో కలిపి పలుచబరుస్తారు (డైల్యూట్ చేస్తారు). ఈ పలుచబరిచిన స్టార్చ్‌ను 600 నంబర్ జల్లెడ ద్వారా పంపిస్తారు. ఈ దశలో అతి సూక్ష్మమైన పీచు పదార్థం కూడా వేరు చేయబడుతుంది. ఈ ప్రక్రియ తర్వాత లభించే స్టార్చ్ స్వచ్ఛమైన తెల్లని రంగులో ఉంటుంది. ఈ తెల్లని స్టార్చ్‌ను ఉపయోగించి సగ్గుబియ్యం బాల్స్‌ను తయారు చేస్తారు. స్టార్చ్ నుంచి నీరంతా తీసివేసిన తర్వాత, మిగిలిన భాగాన్ని స్టార్చ్‌గా పిలుస్తారు.

సగ్గుబియ్యం బాల్స్‌ను తయారు చేసిన తర్వాత, వాటిని రోస్ట్ చేయాలి. రోస్టింగ్ ప్రక్రియలో సగ్గుబియ్యం బుడగల్లాగా జెల్స్‌గా మారతాయి. ఈ జెల్స్‌ను డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్‌ల మీద లేదా పెద్ద ఫ్యాక్టరీలలోని డ్రైయర్‌లలో ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత, కొన్ని లంప్స్ (ముద్దలు) ఏర్పడతాయి. ఈ లంప్స్‌ను ఒక యంత్రంలో వేసి బ్రేక్ చేసి, పౌడర్, బాల్స్‌గా వేరు చేస్తారు. మార్కెట్‌లో సగ్గుబియ్యం మూడు వేర్వేరు సైజులలో లభిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, సగ్గుబియ్యం కార్బోహైడ్రేట్లకు గొప్ప వనరు. వీటిలో కాంప్లెక్స్ స్టార్చెస్ ఉంటాయి, ఇది శక్తిని అందిస్తుంది. వైద్యుల ప్రకారం, సగ్గుబియ్యం కండరాలను, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. సగ్గుబియ్యం తయారీలో వచ్చే బైప్రొడక్ట్ స్టార్చ్‌ను కేవలం ఆహార పరిశ్రమకే కాకుండా, బిస్కెట్లు, చాక్లెట్ల తయారీతో పాటు టెక్స్‌టైల్ రంగంలో కూడా ఉపయోగిస్తారు.

Karrapendalam

Karrapendalam

Also Read:  వేసవిలో ఉదయాన్నే ఒక కప్పు.. రోజంతా బాడీ కూల్.. కూల్.. 

Follow Us