AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Electricity Bill: ఎమ్మెల్యేల ఇంటి కరెంటు బిల్లు ఎవరు కడతారు? జీతంతో పాటు వచ్చే ఈ ప్రత్యేక సౌకర్యాల గురించి మీకు తెలుసా?

MLA Electricity Bill: భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో, ఎమ్మెల్యేల అధికారిక నివాసాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రజా ప్రతినిధులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలలో భాగంగా దీనిని పరిగణిస్తారు. అయితే రాష్ట్రానికో నిబంధన ఉంది. అలాగే

MLA Electricity Bill: ఎమ్మెల్యేల ఇంటి కరెంటు బిల్లు ఎవరు కడతారు? జీతంతో పాటు వచ్చే ఈ ప్రత్యేక సౌకర్యాల గురించి మీకు తెలుసా?
Mla Electricity Bill
Subhash Goud
|

Updated on: May 10, 2026 | 8:15 PM

Share

MLA Electricity Bill: భారతదేశంలో శాసనసభ్యులకు (MLAs) వారి జీతంతో పాటు ప్రభుత్వం నుండి అనేక రకాల సౌకర్యాలు లభిస్తాయి. ఉచిత నివాసం, ప్రయాణ భత్యాలు, వైద్య సదుపాయాల గురించి మనందరికీ తెలుసు. అయితే, వారి ఇంటి విద్యుత్ బిల్లు విషయంలో ఉన్న నిబంధనలు ఏంటో మీకు తెలుసా? ఎమ్మెల్యేలు తమ స్వంత జేబు నుండి కరెంటు బిల్లు కడతారా లేదా ప్రభుత్వం చెల్లిస్తుందా? అనే ఆసక్తికరమైన విషయా తెలుసుకుందాం..

ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందా?

భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో, ఎమ్మెల్యేల అధికారిక నివాసాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లించే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రజా ప్రతినిధులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలలో భాగంగా దీనిని పరిగణిస్తారు. అయితే రాష్ట్రానికో నిబంధన ఉంది. ఎమ్మెల్యేలకు ఇచ్చే విద్యుత్ రాయితీలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. కొన్ని రాష్ట్రాలు ఎమ్మెల్యేలకు ప్రతి నెలా లేదా ఏడాదికి నిర్దిష్ట సంఖ్యలో ఉచిత విద్యుత్ యూనిట్లను కేటాయిస్తాయి. నిర్ణీత పరిమితి దాటితేనే వారు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే భత్యాల రూపంలో (Allowances) నిబంధనలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లు కోసం ప్రత్యేకంగా నగదును భత్యాల రూపంలో ఇస్తారు. ఉదాహరణకు ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు తమ విద్యుత్, నీటి బిల్లుల ఖర్చును రీయింబర్స్‌మెంట్ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రులు, మంత్రులు విషయానికొస్తే.. సాధారణ ఎమ్మెల్యేలతో పోలిస్తే క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులకు విద్యుత్ సౌకర్యాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో వీరికి వేల సంఖ్యలో యూనిట్లు ఉచితంగా లభిస్తాయి.

ఇది కూడా చదవండి: PM Modi: పెట్రోల్‌, డీజిల్‌ వాడకంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ నివాసాల్లో ఉంటే?

ఒకవేళ ఎమ్మెల్యే ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్ లేదా నివాసాల్లో ఉంటే ఆ బిల్లులను సాధారణంగా సంబంధిత ప్రభుత్వ శాఖలే నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తాయి. ఎమ్మెల్యేల జీతభత్యాల చట్టాల్లో కాలక్రమేణా చేసే మార్పులను బట్టి ఈ సౌకర్యాలు మారుతూ ఉంటాయి. మొత్తానికి, సాధారణ పౌరులు కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది పడుతుంటే, ప్రజా ప్రతినిధులకు మాత్రం ఆ భారం లేకుండా ప్రభుత్వమే అండగా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: Viral Video: కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియోతో నెటిజన్ల షాక్

ఇది కూడా చదవండి: Alcohol Bottles: మద్యం సీసాలను గాజుతో ఎందుకు తయారు చేస్తారు? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us