Business Idea: వడాపావ్ అమ్మితే నెలకు రూ. 2 లక్షలా..! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువే.. షాకింగ్ నిజాలు!
Business Idea: వడా పావ్ అమ్మేవారి ఆదాయం చాలా వరకు వారి అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అంటే, అమ్మకాలు ఎంత ఎక్కువగా ఉంటే, వారు అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఈరోజు మనం వడా పావ్ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకుందాం..

Business Idea: మనం సాధారణంగా రోడ్డు పక్కన బండి మీద వడాపావ్ అమ్మే వారిని చూసి, వారు కేవలం రోజు గడవడానికి మాత్రమే సంపాదిస్తారని అనుకుంటాం. కానీ, అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక కథనం ప్రకారం, ముంబై వంటి నగరాల్లో ఒక సాధారణ వడాపావ్ విక్రేత సంపాదన పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఎంబీఏ గ్రాడ్యుయేట్ల జీతం కంటే ఎక్కువగా ఉంది.
సంపాదన లెక్కలు ఇలా ఉన్నాయి: రోజువారీ అమ్మకాలు: ఒక రద్దీగా ఉండే ప్రాంతంలో సగటున రోజుకు 600 నుండి 1000 వరకు వడాపావ్‌లు అమ్ముడవుతాయి. ఒక్కో వడాపావ్ ధర రూ. 15 నుండి రూ. 20 వరకు ఉంటుంది. రోజువారీ ఆదాయంను పరిశీలిస్తే సగటున ఒక రోజుకు రూ. 9,000 నుండి రూ. 10,000 వరకు గల్లా పెట్టెలోకి వస్తుంది. నెలవారీ లాభం గురించి చూస్తే.. ముడి సరుకులు, గ్యాస్, కార్మికుల ఖర్చులు అన్నీ పోను, ఒక విజయవంతమైన వడాపావ్ విక్రేత నెలకు రూ. 2 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు నికర లాభం సంపాదిస్తున్నారు. అంటే ఏడాదికి వీరి ఆదాయం దాదాపు రూ. 24 లక్షల పైమాటే. కష్టపడే తత్వం, రుచి,సరైన లోకేషన్ ఉంటే చిన్న వ్యాపారమే అయినా అది కార్పొరేట్ ఉద్యోగాల కంటే మిన్న అని రూనిపిస్తోంది ఈ వ్యాపారం.
ఇది కూడా చదవండి: Gold Jewellery: తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత తరుగు పోతుంది? ఎవ్వరికి తెలియని ఛార్జీల సీక్రెట్ ఇదే.!
వడా పావ్‌తో పాటు ఉల్లిపాయ కూర, పాలకూర కూర వంటి ఇతర రకాల వంటకాలను కూడా అమ్మితే, వడా పావ్ అమ్మేవారి ఆదాయం మరింత పెరుగుతుంది. ఈ విధంగా, రోజుకు 400 నుండి 500 వడా పావ్‌లు అమ్మే వ్యక్తి 5 వేల రూపాయల ఆదాయం సంపాదించగలడు.

Vada Pav
ఇది కూడా చదవండి: Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
