AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియోతో నెటిజన్ల షాక్

Viral Video: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక యువకుడు హిమాచల్ లేదా ఉత్తరాఖండ్ వంటి అందమైన పర్వత ప్రాంతాల్లో రోడ్డు పక్కన మ్యాగీ స్టాల్ నడుపుతున్నాడు. కేవలం మ్యాగీ వండటం, వడ్డించడమే కాదు.. తన సంపాదన వివరాలను కూడా..

Viral Video: కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియోతో నెటిజన్ల షాక్
Maggi
Subhash Goud
|

Updated on: May 10, 2026 | 6:16 PM

Share

Viral Video: మనం ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు లేదా జీతం చాలనప్పుడు సరదాగా ఒక మాట అంటుంటాం.. “ఇవన్నీ వదిలేసి ఎక్కడైనా టీ కొట్టు పెట్టుకుంటే హాయిగా ఉంటుంది” అని. కానీ, ఒక యువకుడు అదే ఆలోచనను నిజం చేసి చూపిస్తున్నాడు. కేవలం మ్యాగీ నూడుల్స్ అమ్ముతూ అతను సంపాదిస్తున్న అంకెలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

అసలేం జరిగింది?

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక యువకుడు హిమాచల్ లేదా ఉత్తరాఖండ్ వంటి అందమైన పర్వత ప్రాంతాల్లో రోడ్డు పక్కన మ్యాగీ స్టాల్ నడుపుతున్నాడు. కేవలం మ్యాగీ వండటం, వడ్డించడమే కాదు.. తన సంపాదన వివరాలను కూడా ధైర్యంగా బయటపెట్టాడు. ఒక సాధారణ ఉద్యోగి నెలకు సంపాదించే మొత్తాన్ని అతను కేవలం ఒక్క రోజులో సంపాదిస్తున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: Business Idea: వడాపావ్ అమ్మితే నెలకు రూ. 2 లక్షలా..! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువే.. షాకింగ్ నిజాలు!

లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్

ఆ యువకుడు ఒక ప్లేట్ మ్యాగీని రూ.70 కి విక్రయిస్తున్నాడు. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఒక రోజులో సుమారు 300 నుండి 350 ప్లేట్ల వరకు అమ్ముడవుతాయట. ఈ లెక్కన చూస్తే, ఒకే రోజులో అతని గల్లా పెట్టెలోకి రూ.21,000 వచ్చి చేరుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఇక చాలు.. నేను కూడా ఉద్యోగానికి రిజైన్ చేసి కొండల్లో మ్యాగీ అమ్ముకుంటా” అని కొందరు.. “మనం అనవసరంగా చదువుకుని ఆఫీసుల్లో కూర్చుంటున్నాం, ఇదే బెస్ట్ బిజినెస్” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కనిపించినంత సులభమా?

రోజుకు రూ.21 వేలు అంటే నెలకు లక్షల్లో సంపాదన అని మనం లెక్కలు వేయవచ్చు. కానీ, పర్వత ప్రాంతాల్లో వ్యాపారం చేయడం అనుకున్నంత సులభం కాదు. పర్యాటక సీజన్‌లో మాత్రమే ఇలాంటి ఆదాయం ఉంటుంది. మిగిలిన రోజుల్లో బోణీ అవ్వడం కూడా కష్టమే. చలి, వర్షం లేదా మంచు కురిసినప్పుడు అక్కడ మనుగడ సాగించడం సవాలుతో కూడుకున్న పని. వేల అడుగుల ఎత్తులో సరుకులు తెచ్చుకోవడం, గంటల తరబడి నిలబడి వండటం సామాన్యమైన విషయం కాదు. ఏది ఏమైనా, ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

View this post on Instagram

A post shared by Badal Thakur (@yeah_badal)

ఇది కూడా చదవండి: Alcohol Bottles: మద్యం సీసాలను గాజుతో ఎందుకు తయారు చేస్తారు? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us