Prices Rise: సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు – వంటింటి బడ్జెట్‌కు చిల్లు!
Prices Rise: ఒకవైపు సామాన్యుడికి పెట్రోల్, డీజిల్ ధరల భయం పొంచి ఉండగా, మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు పెరగడం 'గోరుచుట్టుపై రోకలిపోటు'లా మారింది. వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైతే, ఈ ద్రవ్యోల్బణ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది...

Prices Rise: ప్రముఖ ఎఫ్.ఎమ్.సి.జి (FMCG) దిగ్గజం డాబర్ ఇండియా షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2027) మొదటి త్రైమాసికం నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ సంకేతాలిచ్చింది. కేవలం డాబర్ మాత్రమే కాదు, హిందుస్థాన్ యూనీలీవర్ (HUL), నెస్లే, బ్రిటానియా వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించేలా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు.
ఇది కూడా చదవండి: Gold Jewellery: తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత తరుగు పోతుంది? ఎవ్వరికి తెలియని ఛార్జీల సీక్రెట్ ఇదే.!
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు:
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు: ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడి చమురు (Crude Oil) సరఫరాకు ఆటంకం కలుగుతోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరగడంతో పాటు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. బిస్కెట్లు, వంట నూనెలు, పాలు, కాఫీ, టీ పొడి వంటి ఉత్పత్తుల తయారీకి కావాల్సిన ముడి సరుకుల ధరలు నిలకడగా పెరగడం కంపెనీలపై భారాన్ని పెంచుతోంది.
ఇది కూడా చదవండి: Air Cooler: కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? కేవలం ఈ ఒక్క వస్తువుతో మీ గదిని సువాసనలతో నింపేయండి!
గ్రామీణ డిమాండ్ పెరగడం:
గత కొన్ని త్రైమాసికాలుగా మందగించిన గ్రామీణ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అయితే, ఇదే సమయంలో ఖర్చులు పెరగడం వల్ల కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ధరల పెంపును అనివార్యం చేస్తున్నాయి.
ఏయే ఉత్పత్తులపై ప్రభావం ఉండవచ్చు?
మీ వంటింటి బడ్జెట్‌ను దెబ్బతీసేలా ఈ కింది వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
పర్సనల్ కేర్: సోపులు, షాంపూలు, డిటెర్జెంట్లు, టూత్ పేస్టులు.
ప్యాకేజ్డ్ ఫుడ్: బిస్కెట్లు, చిరుతిళ్లు (Snacks), నూడుల్స్, చాక్లెట్లు.
పానీయాలు: పాలు, టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్.
ఒకవైపు సామాన్యుడికి పెట్రోల్, డీజిల్ ధరల భయం పొంచి ఉండగా, మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు పెరగడం ‘గోరుచుట్టుపై రోకలిపోటు’లా మారింది. వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైతే, ఈ ద్రవ్యోల్బణ ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




